Rakesh Jhunjhunwala : స్టాక్ మార్కెట్ దిగ్గ‌జం రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత

NQ Staff - August 14, 2022 / 03:33 PM IST

151614Rakesh Jhunjhunwala : స్టాక్ మార్కెట్ దిగ్గ‌జం రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత

Rakesh Jhunjhunwala : ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఈ రోజు ఉదయం 6.45 గంటలకు మృతి చెందారు. ఆయన వయస్సు ప్రస్తుతం 62 ఏళ్లు కాగా, అనారోగ్యంతో మృతి చెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. ఇటీవలే ఆయ‌న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నేటి ఉదయం 6.45 గంటలకు ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ఆస్పత్రికి తరలించారు.

నివాళులు..

ఝున్‌ఝున్‌వాలాను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ట్రేడర్‌గా చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఎంతో పేరుగడించిన ఆయన.. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. తన వ్యాపార చిట్కాలతో ఆయన వారెన్‌ బఫెట్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి. ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణంతో పలువురు వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

 Rakesh Jhunjhunwala Passed Away Today Morning

Rakesh Jhunjhunwala Passed Away Today Morning

రాకేష్‌ను బిగ్ బుల్, వారెపన్ బ‌ఫెట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. ఇటీవల CNBC TV-18 ఛానల్ లో కనిపించిన బిగ్ బుల్ మాటల్లో ఉచ్ఛారణ, కృంగిపోయినట్లు కూర్చుని సన్నని గొంతుతో సమాధానాలు చెబుతూ కనిపించటం క్షీణించిన ఆయన ఆరోగ్య పరిస్థితులకు అద్ధం పట్టింది. టీవీ ఇంటర్వ్యూలో ఆకాశ ప్రయాణం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించారు. రానున్న కాలంలో భారతీయ స్టాక్ మార్కెట్ల గమనం ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడారు.

ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా తన స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని కేవలం రూ.10,000 తో ప్రారంభించారు. కానీ ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ దాదాపు రూ.44,000 కోట్లకు చేరుకుంది. ట్రేడింగ్ అనేది విడిచిపెట్టలేని అలవాటు, అయితే సరైన మార్గంలో దానిని వినియోగించుకుంటే ఎలా ఉంటుందో ఆయన అనేక మార్లు తన లాభాలతో మనందరికీ తెలియజేశారు. మార్కెట్లను అంచనా వేయటంలో ఆయన ఘనాపాటి అని చెప్పుకోక తప్పదు.

బిగ్ బుల్ తన పోర్ట్ ఫోలియోపై పెట్టిన శ్రద్ధలో కొంతైనా తన ఆరోగ్యంపై పెట్టి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని కొందరు నెటిజన్లు ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్రార్ధిస్తున్నారు.