Rajuram : జస్ట్ 49 రూపాయలు ఖర్చు చేసి 1 కోటి గెలిచాడు.!
NQ Staff - January 1, 2023 / 12:49 PM IST

Rajuram : కోట్లు పోగొట్టుకున్నాడు.. లక్షల్లో నష్టపోయాడు.. అంటుంటాం.. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారాల్లో. కానీ, ఓ లక్కీ మ్యాన్ జస్ట్ 49 రూపాయలు ఖర్చు చేస్తే ఏకంగా కోటి రూపాయల జాక్పాట్ తగిలింది.
వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రంలోని నవాదా జిల్లా పిప్రా గ్రామానికి చెందిన రాజారామ్ అనే వ్యక్తి, స్థానికంగా డీజేగా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నరగా ‘డ్రీమ్ 11’ అనే బెట్టింగ్ యాప్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వున్నాడు.
కోటి కొల్లగొట్టేశాడు..
తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీకి సంబంధించి కేవలం 49 రూపాయలతో పందెం కాశాడు. బ్రిస్బేట్ హిట్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్లో తనకు నచ్చిన ఉత్తమ ఆటగాళ్ళతో జట్టుని ఎంపిక చేసుకున్నాడు.
లక్కీగా ఆ జట్టే అగ్రస్థానంలో నిలవడంతో, రాజురామ్కి కోటి రూపాయల బంపర్ ప్రైజ్ దక్కింది. 30 లక్షల రూపాయలు పన్నుల రూపంలో పోగా, మిగిలిన డెబ్భయ్ లక్షలు అతని ఖాతాలో జమయ్యాయి.
రాజురామ్ ఘనతకి ఆ ఊరి జనం ఉబ్బితబ్బిబ్బవుతున్నారట. ఇప్పడంతా ఆయన్ని లక్కీ డీజే రాజురామ్ అంటున్నారట.