Rajinikanth: అట్ట‌హాసంగా నేష‌న‌ల్ అవార్డ్ కార్యక్ర‌మం.. స‌తీమ‌ణితో హాజ‌రైన ర‌జ‌నీకాంత్‌

Rajinikanth 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం ఢిల్లీ వేదిక‌గా ఘ‌నంగా జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు.

మణికర్ణిక’ చిత్రానికి గానూ కంగనా రనౌత్‌ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌(భోంస్లే) అవార్డులు అందుకున్నారు. ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా జెర్సీ నిలిచింది. ఎడిటింగ్‌ విభాగంలోనూ జెర్సీ సినిమాకు అవార్డు దక్కింది.

సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ర‌జ‌నీకాంత్‌కి లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించనుంది.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేయనున్నారు. మరోవైపు ఒకే ఏడాదిలో రజనీకాంత్‌, ఆయన అల్లుడు ధనుష్‌ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

67 నేష‌న‌ల్ అవార్డ్స్ విజేత‌లు వీరే..

విజేతలు వీరే..

*ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)

*ఉత్తమ నటుడు: మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)

*ఉత్తమ నటి : కంగనా రనౌత్‌ (మణికర్ణిక)

*ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)

*ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ

* ఉత్తమ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి (జెర్సీ)

*ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి

*ఉత్తమ హిందీ చిత్రం: చిచ్చోరే

*ఉత్తమ తమిళ చిత్రం: అసురన్‌

* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

* ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

* ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)

* ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

* ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)

* ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)

* ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)

* ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)

*ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)