Rajendra-singh-gudha: రోడ్లు క‌త్రినా బాడీలోని ఆ పార్ట్‌ల మాదిరిగా ఉండాలి.. నోరు జారిన మంత్రి

Rajendra-singh-gudha: పొడుగు కాళ్ల సుంద‌రి క‌త్రినా ఏదో ఒక మేటర్‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతూనే ఉంటుంది. కొత్తగా పదవి చేపట్టిన మంత్రి .. కత్రినా కైఫ్ బాడీ పార్డును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సదరు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ మ‌ధ్య క‌త్రినా పెళ్లికి సంబంధించి వార్త‌లు రాగా, దానిపై స్పందించిన క‌త్రినా.. ‘నేను సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది.

rajendra-singh-gudha comment on katrina kaif1
rajendra-singh-gudha comment on katrina kaif1

ఈ 15 ఏళ్లలో నా పెళ్లి గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది. ఒక్కో వ్యక్తితో ఒక్కో నెల.. నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు..’అంటూ చిరు కోపం వ్యక్తం చేసిన నటి కత్రినా కైఫ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. రాజస్థాన్ రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గుధా హీరోయిన్ కత్రినా కైఫ్ శరీర భాగాన్ని ప్రస్తావిస్తూ బహిరంగ కామెంట్లు చేసిన ఉదంతం వివాదాస్పదమైంది.

అశోక్ గెహ్లాట్ రెండ్రోజుల కిందటే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం తెలిసిందే. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు రాల్చే వర్గాలకు చెందిన నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విధంగా రాజేంద్ర సింగ్ గుధా రాజస్థాన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన మూడో రోజే హీరోయిన్ కత్రినా కైఫ్ ను ఉద్దేశించి గుధా అనుచిత కామెంట్లు చేశారు.

రాజస్థాన్ కేబినెట్ లో కీలకమైన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు సహాయ మంత్రిగా ఉన్న రాజేంద్ర సింగ్..అక్కడికొచ్చిన ప్రజలతో మాట్లాడుతూ కత్రినా కైఫ్ బాడీ పార్డులను అభివర్ణించారు . రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, ఇబ్బందులు తొలగిపోయేలా వాటిని బాగు చేయడమో, కొత్త రోడ్లు వేయడమో చేయాలని ప్రజలు కోరారు.

మైకులో మాట్లాడుతోన్న మంత్రి.. ఇంజనీర్ వైపునకు తిరిగి.. ‘ఏంది ఇంజనీర్ సాబ్.. ప్రజలు ఏమడుతుతున్నారో వినిపించింది కదా.. గుర్తుంచుకోండి.. నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి. హీరోయిన్ బుగ్గలు ఉన్నంత నాజూగ్గా రోడ్లు కావాలి..’అని మంత్రి ఆదేశించారు.మంత్రి నోట పాపులర్ హీరోయిన్ పేరు రావడంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారే గొల్లున నవ్వారు.

rajendra-singh-gudha comment on katrina kaif2
rajendra-singh-gudha comment on katrina kaif2

వారి ఉత్సాహాన్ని గమనించిన మంత్రి రాజేందర్ రెండోసారి కూడా.. ‘నా నియోజకవర్గంలో రోడ్లన్నీ కత్రినా కైఫ్ బుగ్గల్లాగా నున్నగా, తళతళలాడేలా ఉండాలి’అని ఇంజనీర్ ను ఆదేశించారు. మంత్రి రాజేంద్ర సింగ్ వ్యాఖ్యల వీడియో నిమిషాల్లోనే వైరలైంది. మంత్రి రాజేందర్ చేసిన కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కత్రినా కైఫ్ పేరుతో సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ మంత్రి ఉదంతంపై ప్రియాంక గాంధీ వెంటనే స్పందించాలని, అతనిపై చర్యలకు ఆదేశించాలని లేదంటే కనీసం కామెంట్లను ఖండించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.