Rajender Or Sanjay Is Cm Candidate : బీజేపీలో బీసీ అభ్యర్థే సీఎం క్యాండిడేట్.. ఆ ఇద్దరిలో ఎవరు..?
NQ Staff - September 3, 2023 / 12:03 PM IST

Rajender Or Sanjay Is Cm Candidate : ఏ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక నినాదాన్ని ఎత్తుకుంటుంది. కొత్త ఎజెండాను ప్లాన్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. కేసీఆర్ అందరి కంటే ముందుగానే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసి వార్ షురూ చేశారు. దాంతో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలపై ఒత్తిడి పెరిగింది. బీఆర్ ఎస్ నుంచి ఎలాగూ కేసీఆర్ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి కేసీఆర్ టీమ్ సవాళ్లు విసురుతోంది. దమ్ముంటే మీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి అంటూ అడుగుతున్నారు.
ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థి ఎవరో చెబితే ప్రజల్లో కూడా మంచి పాజిటివ్ నెస్ పెరుగుతుంది. ఆ విషయాన్ని బీజేపీ నేతలు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే బీఆర్ ఎస్ ప్రకటించిన వారిలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు చాలా తక్కువ. గతంతో పోలిస్తే ఈ సారి బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు చాలా తగ్గించేశారు కేసీఆర్. తెలంగాణలో 65 శాతం ఉన్న బీసీలకు జనాభా ప్రతిపాదికన టికెట్లు ఇవ్వలేదనే విమర్శలు బీఆర్ ఎస్ మీద వస్తున్నాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంటుంటోంది.
వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకే ఎక్కువ టికెట్లు ఇచ్చి తమది బీసీల పార్టీ అని ప్రకటించుకోవాలని భావిస్తోంది. అంతే కాకుండా బీసీ నేతనే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీసీల ఓటు బ్యాంకును రాబట్టుకోవచ్చని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ అధిష్టానానికి కూడా తెలియజేయడంతో.. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. కాకపోతే ఇప్పుడు బీజేపీలో ఉన్న బీసీ నేతల్లో బలమైన వారు ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు బండి సంజయ్, ఇంకొకరు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ అంటే తెలంగాణ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. ఇటు బండి సంజయ్ కూడా మొన్నటి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి పార్టీలో బలమైన పట్టు సాధించారు.
కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. పైగా ఈ ఇద్దరిలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా.. పార్టీలో ఎలాంటి అసమ్మతి అనేది ఉండదు. అందుకే ఈ ఇద్దరి పేర్లను ఢిల్లీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ అంటే తెలంగాణ ఉద్యమ నేతగా ఎంతో పేరుంది. పైగా ఎలాంటి కాంట్రవర్సీలకు పోకుండా ఉంటారు. పైగా ఆయన్ను వ్యతిరేకించేవారు కూడా చాలా తక్కువ.
ఇటు బండి సంజయ్ కు పార్టీలో బలంగా పట్టు ఉంది. పైగా ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి. బీజేపీలో ఎప్పుడైనా పార్టీ మూలాలు ఉన్న వారికే పదవులు కట్టబెడుతారు. బయట నుంచి వచ్చిన వారికి పెద్దగా పదవులు ఇవ్వరు. కాబట్టి ఈ విషయంలో చూస్తే సంజయ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ చూడాలి మరి ఎవరికి ఆ అదృష్టం దక్కుతుందో.