Rajeev Khandelwal Comments On Lady Producer : ఆ మహిళా నిర్మాత పడకగదిలోకి రమ్మంది.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు..!
NQ Staff - June 24, 2023 / 12:42 PM IST

Rajeev Khandelwal Comments On Lady Producer : కాస్టింగ్ కౌచ్ అనగానే చాలామందికి ముందుగా అమ్మాయిలే బాధితులు అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు చేసింది కేవలం హీరోయిన్లు, నటీమణులు మాత్రమే. కానీ అప్పుడప్పుడు మగవారు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రేసుగుర్రం విలన్ ఇలాంటి ఆరోపణలు చేశారు.
ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు కూడా ఇలాంటి సంచలన కామెంట్లు చేశాడు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు రాజీవ్ ఖండేల్వాల్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే.
నేను ఓ లేడీ నిర్మాత దగ్గరకు ఛాన్సుల కోసం వెళ్తుండే వాడిని. ఆమె నాకు చాలా క్లోజ్ అయింది. కానీ ఆమె మనసులో దురుద్దేశం ఉందని నాకు తెలియలేదు. ఓ సారి ఆమె నన్ను కాఫీకి పిలిచింది. సరే అని వెళ్లాను. నీకు హీరోగా ఛాన్స్ ఇస్తా.. కానీ మనం ఓసారి నా బెడ్ రూమ్ లో కలుద్దాం అంటూ మాట్లాడింది.
నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయ్. సారీ మేడం నేను అలాంటి వాడిని కాదు అంటూ అక్కడి నుంచి వచ్చేశాను అంటూ తెలిపాడు రాజీవ్. ఇలాంటి విషయాలను అబ్బాయిలు అబ్బాయిలు ధైర్యంగా ఎదుర్కుంటారు. కానీ అమ్మాయిలు భయపడుతారు. అదే వారికి శాపంగా మారుతూ ఉంటుంది అంటూ తెలిపాడు రాజీవ్.