Rajeev Kanakala Reacts On Suma Kanakala Divorce : సుమతో విడాకుల వల్ల మా పిల్లలు బాధపడ్డారు.. అందుకే అలా చేశా.. రాజీవ్ కనకాల క్లారిటీ..!
NQ Staff - July 23, 2023 / 10:49 AM IST

Rajeev Kanakala Reacts On Suma Kanakala Divorce :
ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల-యాంకర్ సుమ ఇద్దరూ ఇద్దరే. ఎవరి దారుల్లో వారు చాలా బిజీగా గడుపుతున్నారు. నటుడిగా రాజీవ్ కు ఎంతో ఫేమ్ ఉంది. ఇక సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె స్టార్ యాంకర్ గా బుల్లితెరపై చక్రం తిప్పుతోంది. ఒక రకంగా చెప్పాలంటే రాజీవ్ కంటే కూడా సుమనే ఎక్కువ సంపాదిస్తోంది.
అయితే ఇంత అన్యోన్యంగా ఉంటున్న వీరిద్దరూ.. విడిపోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ అవి నిజం కాదు అని ఎన్ని సార్లు వీరిద్దరూ చెప్పినా సరే ఆ రూమర్లు మాత్రం అస్సలు ఆగట్లేదు. తాజాగా రాజీవ్ మరోసారి ఇదే వార్తలపై స్పందించాడు. మేమిద్దరం విడిపోతున్నామని చాలా కాలంగా ఇలా రాస్తున్నారు.
వాళ్ల గురించి ఆలోచించండి..
ఇలాంటివి సుమ పెద్దగా పట్టించుకోదు. కానీ నేను తేలిగ్గా తీసుకోలేను. దాని వల్ల మా పిల్లలు బాధపడుతున్నారు. వారి స్కూల్ లో వచ్చే ప్రశ్నలతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా. మేం విడిపోవట్లేదని చెప్పేందుకు నేను సుమ షోలకు గెస్ట్ గా వెళ్తుంటాను.

Rajeev Kanakala Reacts On Suma Kanakala Divorce
ఆమె చేసే ఈవెంట్లకు కూడా వెళ్తాను. మొన్న అమెరికా వెళ్లినప్పుడు కూడా ఇద్దరం కలిసి ఓ రీల్ చేశాం. అది చాలా ఫేమస్ అయిపోయింది. ఇలా మేం విడిపోవట్లేదని ఎప్పటికప్పుడు చెప్పేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు రాజీవ్. ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.