Rajasthan Government : కులాంతర వివాహం చేసుకుంటే రూ.10లక్షలు.. ప్రకటించిన ప్రభుత్వం..!

NQ Staff - March 29, 2023 / 10:49 AM IST

Rajasthan Government : కులాంతర వివాహం చేసుకుంటే రూ.10లక్షలు.. ప్రకటించిన ప్రభుత్వం..!

Rajasthan Government : ఈ జనరేషన్ లో కులాంతర వివాహాలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు కూడా సదరు జంటలకు అండగా నిలిచేందుకు కొన్ని స్కీములు కూడా తెస్తున్నాయి. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు కొంత అమౌంట్ ను చెల్లిస్తున్నాయి.

తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు రూ.10లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందులో భాగంగానే సీఎం అశోక్ గెహ్లాట్ రీసెంట్ గా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఇందుకోసం నిధులు కేటాయించారు. ఇక తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది గెహ్లాట్ ప్రభుత్వం.

ఈ పథకం ద్వారా రూ.5లక్షలను ఎనిమిదేండ్ల పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. మరో రూ.5లక్షలను భార్యా, భర్తల ఉమ్మడి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అలాంటి స్కీములు తమ రాష్ట్రాల్లో కూడా పెట్టాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us