చర్చలతో వివాదాలను పరిష్కరించుకుందాం: రాజనాథ్ సింగ్

Advertisement

గత మూడు నెలల నుండి సరిహద్దు వెంబడి ఇండియా-చైనా వెంబడి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చేసుకున్న ఒప్పందాలను చైనా సైనికులు నిరంతరం తుంగలో తొక్కుతూనే ఉన్నారు. కానీ ఈసారి ఈ వివాదం మరింత ముదిరేలా ఉంది. ఇప్పటికే భారత సైన్యం కూడా సరిహద్దు వెంబడి భారీగా సైనిక బలగాలను మోహరించారు. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సమావేశం వేదికగా చైనా రక్షణ మంత్రితో జరిగిన భేటీలో సరిహద్దు వివాదాలపై భారత్ వైఖరిని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టంగా తెలియజేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత కొన్ని నెలలుగా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో సహా వాస్తవాధీన రేఖ వెంట పలు ప్రాంతాల్లో జరిగిన పరిణామాలపై రాజ్‌నాథ్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

భారీగా బలగాలను మోహరించి దూకుడుగా ప్రవర్తించడం సరికాదని చైనా అధికారులకు తెలిపారు. సరిహద్దుల విషయంలో భారత్ ఎప్పుడు భాధ్యతాయుతంగానే ఉంటుందని రాజనాథ్ తెలిపారు. వివాదాలను చర్చలతో పరిష్కరించుకుందామని రాజనాథ్ తెలిపారు. అలాగే ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలను చైనా ఎన్నోసార్లు అతిక్రమించిందని, పదే పదే ఘర్షణలకు దిగకుండా దళాలను నియంత్రించే వ్యవస్థ ను పటిష్ఠం చేయాలని నేరుగా చైనా అధికారులకు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here