Rajamouli : ఆస్కార్ కోసం 50 కోట్లు ఖర్చు చేసిన రాజమౌళి.!

NQ Staff - November 24, 2022 / 07:12 PM IST

Rajamouli : ఆస్కార్ కోసం 50 కోట్లు ఖర్చు చేసిన రాజమౌళి.!

Rajamouli : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపేందుకు రాజమౌళి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

ఇండియన్ సినిమా కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్‌లో చోటు దక్కాల్సి వుంది. కానీ, ఆస్కార్ టీమ్ అందుకు అంగీకరించ లేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆస్కార్ బరిలో నిలవనీయకుండా చేశారు.

రాజమౌళి కష్టం వృథా పోకూడదు.!

కానీ, రాజమౌళి మాత్రం ఎలాగైనా ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్కార్ బరిలో నిలపేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నాడు. అందుకోసం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని మోస్ట్ పాపులర్ సినిమాగా ప్రూవ్ చేసేందుకు ప్రపంచం మొత్తం పర్యటిస్తున్నాడు.

ఈ దారిలో ఆస్కార్ బరిలో నిలవాలంటే, ఓటింగ్ ప్రాసెస్‌లో గెలవాల్సి వుంది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. దాదాపు 10వేలు ఓట్లు అయినా పడాల్సి వుంది ది బెస్ట్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి. అందుకోసమే భారీగా ఖర్చు పెడుతున్నాడట రాజమౌళి. దాదాపు ఆ ఖర్చు 50 కోట్లు అని అంచనా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కీలక పాత్రలు పోషించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లు వసూళ్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని చోట్లా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ, తదితర భాషల నుంచి పలువురు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us