RRR Sequel : త్వరలోనే త్రిబులార్ పార్ట్ టూ! జక్కన్న చెక్కడం గురించి తెలిసిన చరణ్, తారక్ పరిస్థితేంటి?
NQ Staff - November 13, 2022 / 01:30 PM IST

RRR Sequel : త్రిబులార్ మూవీతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా ఏం రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కంటిన్యూగా లెజెండరీ మూవీమేకర్స్‌తో కూడా అప్రిషియేషన్స్ దక్కించుకుంటూ, ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతూ తెలుగు సినిమా సత్తాని చాటుతోందీ చిత్రం. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదలైనా త్వరలోనే ఆస్కార్ బరిలోనూ కచ్చితంగా ఉండబోతోదంటూ వార్తలు రావడంతో ప్రపంచ సినీ అభిమానులంతా త్రిబులార్ని చూసి మురిసి పోతున్నారు.
లేటెస్ట్గా ఆ సినిమాకి పార్ట్ టూ ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. సీరియస్ గానే కథా చర్చలు జరిగి, ప్రాజెక్ట్‌ని వీలైనంత త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారనేది కాస్త గట్టిగానే వినిపిస్తున్న మాట.
నిజంగానే ఇది జరిగితే హిస్టరీ రీక్రియేటే అంటూ ఆడియెన్స్ ఎగ్జయిటింగ్‌గా ఉన్నమాట నిజమే అయినా.. ప్రాక్టికల్‌గా ఇక్కడ ఇంకొన్ని సీరియస్ ఎలిమెంట్స్ కూడా తెరపైకొస్తాయి. పాత్రల పరంగా ఇద్దరు హీరోలు త్రిబులార్‌లో అద్భుతంగా పర్ఫామెన్స్ చేసినా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇంకోలా తీసుకున్నారు. మా హీరోని తక్కువ చేశారనీ, మరో హీరోని ఎక్కువ చేశారని తారక్, చరణ్ ఫ్యాన్ మధ్య వార్స్ జోరుగా జరిగాయి. రిలీజై ఇన్నాళ్లయినా టాపిక్ వచ్చిన ప్రతిసారీ పోటీగా మాటలనేసుకుంటున్నారు కూడా.
మామూలు మల్టీస్టారర్ మూవీలతోనే ఇలాంటి సమస్యలు తప్పవు. అలాంటిది త్రిబులార్ లాంటి భారీ పీరియాడికల్ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు కచ్చితంగా కామెంట్స్ వస్తాయని తెలిసినా క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా రాసుకుని ఫ్యాన్స్‌తో పాటు అన్ని భాషల ఆడియెన్స్‌ని సాటిస్ఫై చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు జక్కన్న.
ఇక ఇప్పుడు త్రిబులార్ పార్ట్ టూ అనడంతో అభిమానుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ పక్కకు పెడితే హీరోల రిలేటెడ్‌గా మరో అసలు సమస్య కూడా లేకపోలేదు. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ త్రిబులార్ కోసం మూడేళ్లు కేటాయించారు. గెటప్ అండ్ ఫిజిక్‌తో పాటు లుక్స్ కోసం కూడా శక్తిమేర కష్టపడ్డారు.
షూట్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయినా లాక్ డౌన్, కోవిడ్ రూల్స్ వల్ల సినిమా చాలాసార్లు వాయిదా పడింది. సెట్లో కష్టపడిందే కాక రిలీజ్ పోస్ట్‌పోన్ అయిన ప్రతిసారి ప్రమోషన్స్‌లోనూ పార్టిసిపేట్ చేసి మూవీపై భారీ హైప్ క్రియేటవ్వడానికి కాంట్రిబ్యూట్ చేశారు. అఫ్ కోర్స్.. వాళ్ల కష్టం వృథా పోకుండా దేశవ్యాప్తంగా చేసిన పబ్లిసిటీ, ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి.

Rajamouli Is Making Sequel Story of RRR
ఇప్పుడు త్రిబులార్ సీక్వెల్ గనక ఓకే అయితే చరణ్, ఎన్టీఆర్ మళ్లీ ఏళ్లపాటు డేట్స్ ఇచ్చి డెడికేట్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. ఎంత తొందరగా షూట్ చేసినా ప్రతి ఫ్రేమ్‌ని చెక్కడంలో జక్కన్న తన మార్క్ చూయిస్తాడని తెలిసిందే. అలాంటిది కలెక్షన్స్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన త్రిబులార్ లాంటి సినిమాకి పార్ట్ టూ అంటే ఏ రేంజ్లో డబుల్ ఫోకస్ పెడతాడో, ఆడియెన్స్‌ని థ్రిల్ చేయడానికి ఇంకెంత ఎఫర్ట్ పెడతాడో చెప్పక్కర్లేదు.
మరి రాజమౌళి రిక్వైర్‌మెంట్స్‌కి తగ్గట్టుగా ఇద్దరు బడా హీరోలు మళ్లీ కమిటవుతారా? అనేది పెద్ద డౌటే. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య ఈ భారీ సీక్వెల్‌కి అన్ని ఈక్వేషన్స్ కుదిరి నిజంగానే వర్కవుటవుతుందా అనేది చూడాలి.