Rajamouli : ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్.! మహేష్ వెనక్కి వెళ్ళాల్సిందేనా.?
NQ Staff - November 13, 2022 / 10:46 PM IST

Rajamouli : ఇది నిజంగానే షాకింగ్ అప్డేట్.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కొనసాగింపు వుందట. రాజమౌళి స్వయంగా ప్రకటించేసరికి అంతా అవాక్కయ్యారు. రాజమౌళి తదుపరి సినిమా మహేష్ హీరోగా వుండబోతోన్న సంగతి తెలిసిందే. ‘ప్రపంచ సాహసీకుడు’గా ఆ సినిమాలో మహేష్ కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.
‘గ్లోబ్ ట్రోటింగ్’ అంటూ రాజమౌళి వాడిన ఓ పదం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. కానీ, ఇంతలోనే, ‘ఆర్ఆర్ఆర్-2’ అంటూ రాజమౌళి స్వయంగా చెప్పడం, తన తండ్రి ఆ కథ తయారు చేసే పనిలో వున్నారని అనడంతో ఒక్కసారిగా మహేష్ అభిమానులు షాక్ అయ్యారు.
త్రివిక్రమ్ సినిమా ఆలస్యంతోనే..
మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ మీద వుంది. తొలి షెడ్యూల్లో ఓ చిన్న యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. తర్వాత సినిమా కాస్త ఆగింది.. అంటే గ్యాప్ తీసుకుంది. తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి తర్వాత రాజమౌళి కీలక ప్రకటన.? తన తదుపరి సినిమాపై రాజమౌళి సంక్రాంతి తర్వాత కీలక ప్రకటన చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్-2’ గురించి ఆ ప్రకటన అయితే మాత్రం, మహేష్ సినిమా వెనక్కి వెళ్ళొచ్చు.
నిజానికి, చరణ్ అలాగే ఎన్టీయార్ కూడా ప్రస్తుతం ఖాళీ లేరు. సో, మహేష్ సినిమా వెనక్కి.. అంటున్న ప్రచారంలో నిజమెంత.? అంటే, ఇప్పుడే చెప్పలేం.