Prabhas : సెట్లో స్మోకింగ్ చేస్తున్న ప్రభాస్ పై కోపం తో రాజమౌళి చేసిన పని..!

Prabhas (ప్రభాస్) : సీని పరిశ్రమలో దాసరినారాయణ, రాఘవేంద్రరావు.. లాంటి దర్శకులు ఉన్న చరిత్ర మనది. ఇద్దరు డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. ఆయా హీరోలను స్టార్లుగా మార్చారు. తర్వాతి జనరేషన్ లో వచ్చిన రాజమౌళి.. తన రూటే సపరేటు. రాజమౌళి సినిమా చేశాడంటే అది సూపర్ హిటే. ఇంత వరకు రాజమౌళి డైరీలో ఫ్లాప్ కాదు కదా.. యావరేజ్ సినిమా లేదంటేనే అర్ధం చేసుకోవాలి.

రాజమౌళితో సినిమాలు చేయడానికి హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో కొత్తదనం ఉంటుంది. ఏ సినిమా చేసినా అందులో పర్ ఫెక్షన్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో రాజమౌళి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఇద్దరికీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన సింహాద్రితో రాజమౌళికి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ని కూడా మాస్ హీరోని చేసింది. తర్వాత యమదొంగ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించారు.

ప్రభాస్ తో ఛత్రపతి తీసి ఇండస్ట్రీకే పెద్ద హిట్ ఇచ్చాడు. ఛత్రపతి సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. తర్వాత బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను తీసి జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమని ఎక్కడికో తీసుకెళ్లాడు.

రామ్ చరణ్ తో ఓ సినిమా తీసిపెట్టాలని చిరంజీవి, అల్లు అరవింద్ అడిగారట. చిరంజీవి అడిగితే నో చెప్పలేక.. మగధీర సినిమా తీశాడు. ఆ సినిమా ఏం రేంజ్ లో ఆడిందే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా ఇండస్ట్రీలో హీరోలను స్టార్స్ చేసిన ఘనత ఒక్క రాజమౌళికే చెల్లుతుంది.

బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ సిగరెట్ లు విపరీతంగా తాగేవారట. ప్రభాస్ వరుసగా సిగరెట్ల మీద సిగరెట్లు తాగేవాడట. షూట్ లేని సమయంలో అయితే అందరితో కూర్చుని సిగరెట్ తాగుతూ మాట్లాడేవడట. ఇది గమనించిన రాజమౌళి ప్రభాస్ చేత ఎలాగైనా సిగరెట్లు మాన్పించాలని అనుకున్నాడట. అందుకోసం తెగ ప్రయత్నాలు చేశారు కూడా. కానీ ప్రభాస్ చేత సిగరెట్లు మాన్పించలేకపోయాడు రాజమౌళి.

Advertisement