Raj Kundra: భార్య‌ని పావుగా వాడుకున్న రాజ్ కుంద్రా.. ఆమె ద్వారా రూ.3 వేల కోట్లు సంపాదించాడ‌ట‌

Raj Kundra: మొన్న‌టి వ‌ర‌కు భార్య చాటు భ‌ర్త‌గా, అమాయ‌కుడిగా కనిపించాడు రాజ్ కుంద్రా. కాని ఇప్పుడు ఆయ‌న సాగించిన అరాచకాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తుండ‌డంతో రాజ్ కుంద్రా నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. ఎంతో మంది బాధితులు బ‌య‌ట‌కు వ‌చ్చి రాజ్ కుంద్రా బాగోతాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు.

ఈ కేసులో నోటీసులు అందుకున్న మోడల్, నటి షెర్లిన్‌ చోప్రా ఇటీవ‌ల తీవ్ర ఆరోపణలు చేసింది. రాజ్‌కుంద్రా ఒకానొక సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె పోలీసులకు పిర్యాదుచేసింది. తనతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారని తెలిపింది. నోటీసుల అనంతరం విచారణకు హాజరైన షెర్లిన్‌ చోప్రా.. క్రైం బ్రాంచ్ ఎదుట సంచలన విషయాలు వెల్లడించింది.

ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంటుంది. తాజాగా రాజ్‌కుంద్రాపై బీజేపీ నేత రామ్ కదం చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి.రాజ్‌కుంద్రా ఓ మోడ‌ల్‌ని శారీర‌కంగా వేధించ‌డ‌మే కాకుండా ఆన్‌లైన్ గేమ్ పేరుతో సుమార్ మూడు వేల కోట్ల రూపాయ‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని రామ్ క‌దం చెప్పారు.

ఆన్‌లైన్ గేమ్‌ పేరుతో కుంద్రా లక్షలాది మంది ప్రజలను మోసగించారని, దీని ప్రమోషన్ కోసం తన భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని వాడుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవ‌ల ఓ మోడ‌ల్ రాజ్ కుంద్రాపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, పోలీసులుకు కేసు న‌మోదు చేయ‌క‌పోగా ఆమెపై ఒత్తిడి తెచ్చార‌ని, బాధిత నటిపై ఒత్తిడి తీసుకొచ్చిన పోలీసులు ఎవరో మహారాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని, అతడిపై అప్పుడు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో చెప్పాల‌ని అన్నారు.

రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ‘గేమ్ ఆఫ్ డాట్’అనే ఆన్‌లైన్ గేమ్‌ను ప్రారంభించి సామాన్య ప్రజానీకం నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిందని రామ్ కదం ఆరోపించారు. ఇందుకోసం రాజ్‌కుంద్రా తన భార్య శిల్పాశెట్టిని పావుగా వాడుకున్నాడన్నారు. దీనిని ప్ర‌భుత్వ గుర్తింపు ఉన్న గేమ్‌గా భార్య శిల్పా శెట్టితో ప్రచారం చేయించాడు. ఈ గేమ్ ఆడిన వారు ఏకంగా రూ.3వేల కోట్ల వరకు నష్టపోయారని రామ్ కదం తెలిపారు.

డిస్ట్రిబ్యూట‌ర్స్‌గా ఉన్న వారు 10 నుండి 30 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్ట‌పోయిన‌ట్టు తెలుస్తుంది. ఈ కేసుపై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకొని లోతుగా ద‌ర్యాప్తు చేయాల‌ని రామ్ క‌దం స్ప‌ష్టం చేశారు.