Rain alert : బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం… అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌

Rain alert : భారీ వ‌ర్షాల‌కు ఏపీ అత‌లాకుత‌లం అవుతుంది. ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో గత 25 ఇళ్లల్లో ఎన్నడో లేనంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో తిరుమల లోని మాడవీధులు, శ్రీవారి దర్శనం కోసం వెళ్లే కొన్ని కంపార్ట్మెంట్స్ వరద నీటితో నిండిపోయాయి. చెరువులను తలపించాయి.

rain alert due to low pressure in the Bay of Bengal
rain alert due to low pressure in the Bay of Bengal

ఇటీవ‌ల కురిసిన‌ భారీ వర్షానికి , వరద ప్రభావానికి శ్రీవారి మెట్ల మార్గం మొత్తం ధ్వంసమైంది. శ్రీవారి మెట్లు కొట్టుకుపోయాయి. బండరాళ్లలు పైకి వచ్చి.. నడవడానికి వీలులేకుండా రాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. దీంతో టీటీడీ అధికారులు మరమత్తు పనులు చేప‌ట్టారు.

rain alert due to low pressure in the Bay of Bengal
rain alert due to low pressure in the Bay of Bengal

క‌పిలేశ్వరాల‌యం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లో సైతం భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో.. ఈ మార్గాలల్లోని భక్తులు పయనించడానికి అనుమతిని టీటీడీ అధికారులు నిరాకరిస్తున్నారు. వర్షం , వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే అనుమతించనున్నామని చెప్పారు, మరోవైపు వరదలకు వన్య మృగాలు సైతం రోడ్లమీదకు వస్తున్నాయి.

తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో నవంబర్ 27 నుంచి నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు అతి భారీవర్ష సూచన ఉంది. దీంతో అనంతపురం, గుంటూరు, కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కుర‌వ‌నున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు తిరుపతి పట్టణంతో పాటు తిరుమల గిరులు అతాలకుతలమయ్యాయి. కొండ చరియలు విరిగి పడడం, నడక దారి మొత్తం రాళ్లతో నిండిపోయాయి. ఇక కొండ మీదున్న ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి.