Rahul Gandhi : వైరల్ పిక్ : జోడో యాత్ర లుక్ నుండి బయటకు వచ్చిన రాహుల్ గాంధీ
NQ Staff - March 1, 2023 / 03:20 PM IST

Rahul Gandhi : భారత్ జోడో యాత్ర తో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాద యాత్ర చేసిన రాహుల్ గాంధీ తన లుక్ పూర్తిగా మార్చిన విషయం తెలిసిందే. పాద యాత్ర చేస్తున్నన్ని రోజులు కూడా గడ్డం జుట్టు పెంచిన రాహుల్ గాంధీ ఆ తర్వాత కూడా కొన్నాళ్లపాటు గడ్డం మరియు జుట్టుతో కనిపించాడు.
ఎట్టకేలకు తన రెగ్యులర్ లుక్ కి రాహుల్ గాంధీ వచ్చేశాడు. ఇటీవల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఇలా కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు.

Rahul Gandhi New Look Photos
పొడవాటి జుట్టు మరియు గడ్డం ట్రిమ్ చేసిన రాహుల్ గాంధీ చిరునవ్వు చిందిస్తూ కొత్త లుక్ లో కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ యొక్క గడ్డం మరియు జుట్టు యొక్క లుక్ మార్చడంతో ఆయన్ను చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫొటోలు తెగ షేర్ చేస్తున్నారు.

Rahul Gandhi New Look Photos
భారత్ జోడో యాత్ర సందర్భంగా ఎంతో మందిని కలుస్తూ వచ్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కు చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టంకు కచ్చితంగా తగిన ఫలితం దక్కుతుంది అంటూ ఆ పార్టీ నాయకులు చాలా నమ్మకంతో ఉన్నారు.