Rahul Gandhi : అనర్హత వేటు రాహుల్ గాంధీకి కలిసి వస్తుందా?
NQ Staff - March 25, 2023 / 08:03 PM IST

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాద యాత్ర నిర్వహించిన విషయం తెల్సిందే. ఇప్పటికే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది అంటూ జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కించపర్చే విధంగా మాట్లాడిన కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడటంతో వెంటనే లోక్ సభ నుండి అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. దేశం కోసం గాంధీ కుటుంబం చాలా చేసింది.. అలాంటి కుటుంబాన్ని ఇలా అవమానిస్తారా అంటూ కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు వాయిస్ వినిపిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అనర్హత వేటు అనేది కచ్చితంగా రాహుల్ గాంధీకి కలిసి వచ్చే అంశం అన్నట్లుగా పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ కి విపరీతమైన సానుభూతి దక్కడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఫలితాలు తారు మారు అయినా కూడా ఆశ్చర్యం లేదు.
రాహుల్ గాంధీ అనర్హత వేటును కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఉపయోగించుకుంటే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అది ఎంత వరకు వారు ఉయోగించుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది.