Rahul Gandhi : రాహుల్ చేసిన బొంగులో చికెన్… జనాలు అయ్యారు ఫిదా
NQ Staff - November 13, 2022 / 10:18 AM IST

Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు సంబంధించిన విషయాలు ప్రతి రోజు సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి. సాధారణ జనాలతో కలిసి రాహుల్ గాంధీ చేస్తున్న పనులు వారితో మమేకం అయి ముచ్చటిస్తున్న ముచ్చట్లు ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా తెలంగాణ శివారు లో రాహుల్ గాంధీ చేసిన బొంగు లో చికెన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాహుల్ బొంగు లో చికెన్ ని స్వయం గా వండి తాను తినడం తో పాటు అందరికీ వట్టించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బొంగులో చికెన్ స్థానిక గిరిజనుల యొక్క సాంప్రదాయక వంట.. ఆ వంట ను రాహుల్ గాంధీ వారి సారథ్యం లో చేసి రుచి చూశాడు. కొత్త పద్ధతులను, కొత్త వంటకాలను రుచి చూసేందుకు ఎప్పుడు కూడా ఆసక్తి చూపించే రాహుల్ గాంధీ తాజాగా బొంగులో చికెన్ ని రుచి చూసి ఆస్వాదించాడు.
అంతే కాకుండా తాను చేసిన బొంగులో చికెన్ ని స్థానిక నేతలకు మరియు సీనియర్ నాయకులకు కూడా వడ్డించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జనాలతో మమేకం అవుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాబోయే ప్రధాని అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.