Rahul Gandhi : భారతదేశానికి నేనేం వ్యతిరేకంగా మాట్లాడలేదు
NQ Staff - March 16, 2023 / 05:41 PM IST

Rahul Gandhi : భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. విదేశాల్లో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ భారత దేశానికి సంబంధించిన పలు విషయాలపై మాట్లాడారు.
ఆ సమయంలో భారత్ ను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి ఎంపీలు పార్లమెంటులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్లమెంట్ దద్దరిల్లింది. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ బిజెపి ఎంపీలు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరై తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా తానేమీ మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ పార్లమెంటులో తన వాదనను వినిపించాల్సి వస్తే పూర్తి విషయాలను వెల్లడిస్తానని అన్నారు.
పార్లమెంటులో అవకాశం ఇవ్వకపోతే తనపై వస్తున్న విమర్శలకు బయట మీడియా ముందు అయినా మాట్లాడతానంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నాడు. దేశాన్ని గౌరవించడం మాత్రమే మా కుటుంబానికి తెలుసని, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం గాంధీ కుటుంబానికి తెలియదన్నారు.