Rahmika Mandanna : ర‌ష్మిక పోస్ట్‌తో పుష్ప 2పై భారీగా పెరిగిన అంచ‌నాలు.. త‌గ్గేదేలే అంటుందిగా..!

Rahmika Mandanna : సౌత్‌తో పాటు నార్త్‌లోను సంచ‌ల‌నం సృష్టిస్తున‌న్న చిత్రం పుష్ప ది రైజ్. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన హాట్రిక్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. చిత్రంలో బన్నీ మాస్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. భారీ రేంజ్‌లో అల్లు అర్జున్ తొలి ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు సుకుమార్. అయితే ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందనుందని ముందే ప్రకటించిన సుక్కు.. ప్రస్తుతం రెండో భాగంపై పూర్తి దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

Rahmika Mandanna comments about Pushpa 2 movie
Rahmika Mandanna comments about Pushpa 2 movie

తొలి పార్ట్‌ని మించేలా రెండో పార్ట్ తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్రచారం న‌డుస్తుంది. ‘పుష్ప ది రూల్’ షూటింగ్‌ను ఫిబ్రవరి నెలలో మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం సుకుమార్ కేవలం 100 రోజుల టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి మే నెల నాటికి టాకీ పార్ట్ మొత్తం ఫినిష్ చేయాలని, ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టి దసరా బరిలో పుష్పరాజ్‌ని మళ్ళీ రంగంలోకి దించాలని ఆయన స్కెచ్చేసినట్లు తెలుస్తోంది.

పుష్ప 2 అంచ‌నాలు మించి ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ర‌ష్మిక చేసిన ఆస‌క్తికర పోస్ట్ మూవీపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రష్మిక నవ్వుతూ ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. “పుష్ప పట్ల మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. ఈ ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేస్తుంది.. మేము మీకు వాగ్దానం చేస్తున్నాము.. పుష్ప 2 మరింత బిగ్గర్ గా, బెటర్ గా ఉంటుంది!” అంటూ పోస్ట్ చేసింది.

“పుష్ప : ది రైజ్‌”లో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనంజయ, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. సమంత ‘ఊ అంటావా ఊ ఊ అంటవా’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతోంది.

పుష్ప చిత్రంపై సామాన్యులు, సెల‌బ్రిటీలు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంపై అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మహేష్ బాబు, రవీంద్ర జడేజా వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. “పుష్ప : ది రైజ్” మాస్ ఫీస్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ‘పుష్ప’రాజ్ ఫైర్ తగ్గనేలేదు. ఈ క్ర‌మంలో అందరి దృష్టి ‘పుష్ప-2’పై ఉంది.