Raghuveera Reddy : రఘవీర రీ ఎంట్రీ.. పార్టీ మారడం పై ఏమన్నాడంటే!
NQ Staff - April 19, 2023 / 07:34 PM IST

Raghuveera Reddy : రాష్ట్రం విడిపోక ముందు తెలుగు రాజకీయాల్లో రఘువీరారెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. పిసిసి అధ్యక్షుడిగా కొనసాగడంతో పాటు మంత్రిగా కూడా సుదీర్ఘ కాలం పాటు రఘువీరారెడ్డి విధులు నిర్వహించారు.
ఈయన గత కొంత కాలంగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. తన ఊరు, తన వ్యవసాయ క్షేత్రంలోనే కాలం గడుపుతూ వచ్చారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు.
దాంతో రఘువీరారెడ్డి రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లే అని చాలా మంది భావించారు. కానీ ఆయన తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ ఖతం అయింది. దాంతో రఘువీరారెడ్డి కనుమరుగయ్యారు. తిరిగి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అధిష్టానం పిలుపు మేరకు అజ్ఞాతం వీడారు.
ఆ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారా లేదంటే మరేదైనా పార్టీకి వెళ్తారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని రఘువీరా క్లారిటీ ఇచ్చారు.