Raghurama krishna Raju : జనసేన, బీజేపీ, టీడీపీ.! ఎటూ తేల్చుకోలేకపోతున్న వైసీపీ ఎంపీ.!

NQ Staff - November 17, 2022 / 04:42 PM IST

Raghurama krishna Raju : జనసేన, బీజేపీ, టీడీపీ.! ఎటూ తేల్చుకోలేకపోతున్న వైసీపీ ఎంపీ.!

Raghurama krishna Raju : ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారుగానీ, ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి బయటకు గెంటివేయబడ్డారు. అలాగని పూర్తిగా గెంటివేత జరగలేదు. ‘నేను ఇంకా వైసీపీలోనే వున్నాను..’ అని చెబుతుంటారాయన. అయితే, ఆయన్ని వైసీపీ దరిదాపుల్లోకి కూడా రానీయడం లేదు.

పరిచయం అక్కర్లేని పేరాయనది. నర్సాపురం ఎంపీ, ‘రచ్చబండ’ రఘురామకృష్ణరాజుగా ముద్రపడ్డారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్నదానిపై రఘురామ మల్లగుల్లాలు పడుతున్నారు.

జనసేన వైపే మొగ్గు..

రఘురామకృష్ణరాజు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయట. బీజేపీతోనూ ఆయన టచ్‌లోనే వున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల కూడా కొంత సానుకూలతతోనే వున్నారు.

ప్రస్తుతానికైతే ఆయా పార్టీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు రఘురామ. ‘ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఏ పార్టీ.? అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు..’ అని రఘురామ చెబుతున్నప్పటికీ, జనసేన అధినేతతో ఇప్పటికే మంతనాలు జరిపి, టిక్కెట్ ఖాయం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికల్లో రఘురామ ఓడించింది ఎవర్నో కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబునే.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us