Raghunandan Rao : బీజేపీకి భారీ షాక్.. దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి..

NQ Staff - December 3, 2023 / 01:28 PM IST

Raghunandan Rao : బీజేపీకి భారీ షాక్.. దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి..

Raghunandan Rao :

బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతగా పేరు గాంచిన రఘునందన్ రావు దుబ్బాకలో ఓడిపోయారు. ఇది ఆయనకు అతిపెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. బీఆర్ ఎస్ నుంచి పోటీ చేస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ప్రతి రౌండ్ లో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

బీజేపీకి షాక్ తగిలింది.. దుబ్బాకలో రఘునందన్ రావు ఓడిపోయారు. బీఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

రఘునందన్ రావు ఓటమి పాలు కావడం అంటే ఆయన రాజకీయ భవిష్యత్ మీద భారీదెబ్బ పడటమే అని చెప్పుకోవాలి. గత ఉప ఎన్నికల్లో మాత్రమే ఆయన విజయం సాధించారు.

ఇప్పటి వరకు చాలా సార్లు పోటీ చేసినా ఆయన మాత్రం విజయం సాధించలేకపోయారు. తొలిసారి ఉప ఎన్నికల్లో మాత్రమే అది కూడా వెయ్యి ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలుస్తారని అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఆయనకు ఓట్లు అనుకున్నంత రాలేదు. దాంతో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీలో దిగ్గజ లీడర్ గా ఉన్న రఘునందన్ రావు ఓడిపోవడం ఆ పార్టీకి అతిపెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us