Raghu rama: ర‌ఘురామ భీమ‌వ‌రం టూర్ క్యాన్సిల్.. సంక్రాంతి సెల‌బ్రేట్ చేసుకుందాం అంటూ ట్వీట్

Raghu rama: హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలిలోని వైసీపీ అసంతృప్త‌ నేత‌, ఎంపీ రఘురామకృష్ణ‌రాజు ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చి వెళ్లిన విష‌యం తెలిసిందే. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు స్థానిక నేతలతోనూ, పార్టీ అధినాయకత్వంతోనూ తీవ్ర విభేదాలు కొనసాగిస్తున్నారు.

raghu ram sankranthi tour
raghu ram sankranthi tour

కొంతకాలంగా నరసాపురం నియోజకవర్గానికి దూరంగా ఢిల్లీలోనూ, హైదరాబాదులోనూ ఉంటున్నారు. త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డంపై మీడియా స‌మావేశం నిర్వ‌హించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఏపీ సీఎం జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే అది రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కడుపు మండిన ప్రజల ప్రతినిధిగా తాను ప్రశ్నిస్తున్నానని, అలా ప్రశ్నిస్తే కూడా రాజద్రోహమా? అని ఆయ‌న అడిగారు.

త‌న‌ను హింసించిన వీడియోలు చూసి ఎవ‌రు ఆనంద‌ప‌డ్డారో త‌న‌కు తెలుస‌ని, త‌న‌ను ఎంత‌గా హింసించారో ప్ర‌జ‌ల‌కు తెలియాల‌ని ఆయ‌న అన్నారు. ఏపీలో రావ‌ణ రాజ్యంపై ప్ర‌జ‌లు విసుగెత్తిపోయార‌ని ర‌ఘురామకృష్ణ‌రాజు వ్యాఖ్యానించారు. హీరో ఎవ‌రో.. కీచ‌కుడెవ‌రో తేల్చుదాం అని వ్యాఖ్యానించారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రం క‌లిసి రావ‌ణ‌రాజ్యాన్ని అంతం చేద్దాం అని ర‌ఘురామకృష్ణ‌రాజు పిలుపునిచ్చారు.

హిందువుల‌కు సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైన పండుగ అని, ఇన్నాళ్లు త‌న‌కు నోటీసులు ఇవ్వ‌కుండా, పండుగ ముందే ఇవ్వ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను న‌ర‌సాపురం నియోజ‌క వ‌ర్గానికి వ‌స్తున్నాన‌ని క‌లెక్ట‌ర్, ఎస్పీకి ఇప్ప‌టికే తెలిపాన‌ని అన్నారు. పండుగ‌కు తాను వ‌స్తున్నాన‌ని తెలిసే త‌న‌కు నోటీసులు ఇచ్చారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సీఐడీ సునీల్‌, సీఎం జ‌గ‌న్‌కు పండుగ‌రోజే నోటీసులు ఇవ్వాల‌ని గుర్తుకు వ‌చ్చిందా? అని ఆయ‌న అన్నారు.

తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా భీమ‌వ‌రం రావ‌ట్లేద‌ని పేర్కొన్నారు. నోటీసులు వ‌ల‌న ఇప్పుడు నేను ఢిల్లిలీ సీనియ‌ర్ అడ్వకేట్స్‌తో చ‌ర్చించాల‌ని అనుకుంటున్నాను.ద‌య‌చేసి విజ‌యవాడ‌కి ఎవ‌రు రావొద్దు. రామ‌రాజ్యం రావాల‌ని సంక్రాంతి పండుగ‌ని అంద‌రం సంతోషంగా జ‌రుపుకుందాం అంటూ ర‌ఘురాము త‌న ట్విట్టర్‌లో పేర్కొన్నారు.