Raghavendra Rao : అన్న‌గారి సాక్షిగా చెబుతున్నా.. చంద్ర‌బాబు సీఎం అవ‌డం ప‌క్కా అంటూ రాఘ‌వేంద్ర‌రావు స్ట‌న్నింగ్ కామెంట్స్

NQ Staff - June 27, 2022 / 09:25 AM IST

Raghavendra Rao : అన్న‌గారి సాక్షిగా చెబుతున్నా.. చంద్ర‌బాబు సీఎం అవ‌డం ప‌క్కా అంటూ రాఘ‌వేంద్ర‌రావు స్ట‌న్నింగ్ కామెంట్స్

Raghavendra Rao : గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు చేపట్టారు. ఇందులోభాగంగా ఆదివారం ఎన్వీఆర్‌ కన్వెషన్‌లో రాఘవేంద్రరావును గజమాల, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సభకు భారీ సంఖ్యలో హాజరైన వారంతా కరతాళ ధ్వనులతో దర్శకేంద్రుడిని అభినందించారు.

Raghavendra Rao interesting comments on Chandra Babu Naidu

Raghavendra Rao interesting comments on Chandra Babu Naidu

జోస్యం చెప్పాడుగా..

అనంతరం సభను ఉద్దేశించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ భారత రత్న కాదని, ఆయనకు ఆ అవార్డు రాలేదని ఎవరూ బాధపడవద్దని ఆయన ప్రపంచ రత్న అంటూ చేసిన ప్రసంగానికి సభికుల నుంచి పెద్ద స్పందన లభించింది. తన సినీ జన్మకు ఎన్టీఆర్‌ కారణమని చెప్పారు.

ఇక ఎన్టీఆర్‌తో తాను తీసిన చాలా సినిమాలు హిట్ కాగా, అప్పుడు పొందిన ఆనందం క‌న్నా ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో పాల్గొన‌డం చాలా ఆనందంగా అనిపించింద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక అన్న‌గారి సాక్షిగా చెబుతున్నా వేదిక మీద ఉన్న‌వారంద‌రు మంచి ప‌దవుల‌లో ఉంటార‌ని స్ప‌ష్టం చేశాడు. అంటే ఇన్‌డైరెక్ట్‌గా చంద్ర‌బాబు కాబోయే సీఎం అని, వేదిక‌పై ఉన్న‌వారిలో కొంద‌రు మంత్రులు అవుతార‌ని రాఘ‌వేంద్ర‌రావు జోస్యం చెప్పారు.

ప్రవాస తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో కూడా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. NRI తేదేపా అమెరికా కన్వీనర్ కోమటి జయరాం ఈ ఉత్సవానికి అధ్యక్షత వహించారు. తెదేపా సీనియర్ నేత రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప‌లువురు ప్ర‌ముఖులు ఇటీవ‌ల పాల్గొన్నారు.

రీసెంట్‌గా జ‌రిగిన వేడుకలో కోమటి జయరాం మాట్లాడుతూ అమెరికాలో ప్రతి నెల ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తామని తదుపరి మహానాడు డెట్రాయిట్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us