సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీలోనే చేరుతా : లారెన్స్

Advertisement

ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉండే లారెన్స్‌ ఒక్కసారిగా చేసిన ట్వీట్‌ తీవ్ర చర్చనీయా అంశంగా మారింది. ఇక ఆయన చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతో మంది పేద వారికి సహాయం చేస్తున్నాను అని, రాజకీయాల్లోకి వస్తే అంతకంటే రెట్టింపుతో ప్రజలకు తన సేవలు అందిస్తానని శనివారం తన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

అంతేకాకుండా రాజకీయాలకు వస్తే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పార్టీలో మాత్రమే చేరతానంటూ సంచలన విషయాలు తెలిపాడు. అలాగే వ్యక్తిగత వివాదాలకు నేనెప్పుడూ దూరంగా ఉంటానని, రజనీకాంత్‌ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటా అని పేర్కొన్నాడు. అయితే ప్రజలకు నా వంతు సేవ చేయడానికే రాజకీయాల లోకి వస్తున్న అని లారెన్స్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here