Radhika Apte : ఆ టాలీవుడ్ హీరో రూమ్ కు రమ్మన్నాడు.. రాధికా ఆప్టే సెన్సేషనల్..!
NQ Staff - June 16, 2023 / 04:28 PM IST

Radhika Apte : నార్త్ భామలు తెలుగు హీరోలతో నటించి ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోవడం చూస్తున్నాం. అయితే తెలుగులో సినిమాలు చేసినప్పుడు తెలుగు హీరోలను పొగుడుతున్నారు. అదే బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత తెలుగు హీరోలపై ఏదో ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు రాధికా ఆప్టే కూడా ఇదే లిస్టులోకి వచ్చేసింది. ఆమె చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.
తాజాగా ఆమె ఓ ఇంగ్లీష్ సినీ వెబ్‌సైట్‌తో మాట్లాడింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. నేను కూడా సినిమాల్లో మొదట్లో కష్టాలు పడ్డాను. ఛాన్సుల కోసం చాలా మంది డైరెక్టర్ల ఆఫీసులకు వెళ్లాను. ఆ సమయంలోనే నాకు ఓ ఫోన్ వచ్చింది. అతను ఓ తెలుగు హీరో అనుకుంటా. అతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు.
నేను పిలిచినప్పుడు రూమ్ కు వచ్చేయ్.. నా సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తా అన్నాడు. అప్పుడు అతని పేరు కూడా నేను తెలుసుకోలేదు. నాకు కోపం వచ్చి అప్పుడే దుమ్ము దులిపేశాను. నేను సినిమా ఛాన్సుల కోసం ఎన్నడూ లొంగిపోలేదు. నా ట్యాలెంట్ మీదనే నాకు నమ్మకం ఉంది.
అదే నాకు అవకాశాలు తీసుకువచ్చింది. ఇప్పుడు సినీ కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చాను. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. అందులో చెప్పుకోదగింది మాత్రం లెజెండ్ సినిమా. ఆ తర్వాత రెండు సినిమాల్లో నటించింది ఈ భామ.