‘రాధే శ్యామ్’ కథేంటో రివీలైపోయింది..బాహుబలి రికార్డ్ బద్దలవడం ఖాయం..?
Vedha - October 28, 2020 / 06:30 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ లో నటిస్తున్న 20 వ సినిమా రాధే శ్యామ్. జిల్ ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాని యువి క్రియోషన్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా ప్రభాస్ పెదనాన్న సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి ప్రశీద నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంతకముందు విదేశాలలో షూటింగ్ జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసుకొని షూటింగ్ వెళ్ళి కరోనా కారణంగా అనుకున్నషెడ్యూల్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఇండియాకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే రీసెంట్ గా ప్రభాస్ టీమ్ మళ్ళీ రాధే శ్యామ్ షూటింగ్ కోసం యూరప్ వెళ్ళారు. షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని ఇండియాకి తిరిగి రానున్నారు.
ఇక ఈ సినిమా పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందుతోందని మొదటి నుంచి వార్తలు వస్తున్నప్పటికి మేకర్స్ ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్ మేయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సచిన్ ఖేడ్కర్ ‘రాధే శ్యామ్’ కథ ఏంటో రివీల్ చేసేశాడు. ‘రాధే శ్యామ్’ కథ జ్యోతిష్యానికి సైన్స్ కు మధ్య సాగే అద్భుతమైన రొమాంటిక్ లవ్ స్టోరీ అని సచిన్ కేడ్కర్ అసలు కథ రివీల్ చేసేశారు. దాంతో ప్రభాస్ కెరీర్ లో ఇలాంటి కథ తో ఇప్పటి వరకు సినిమా చేయకపోవడంతో ఖచ్చితంగా బాహుబలి కంటే భారీ సక్సస్ సాధించడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.