Radhe shyam: రాధే శ్యామ్‌కి హిందీలో నిరాశ‌.. తొలి రోజు త‌క్కువ వ‌సూళ్లు రానున్నాయా..

NQ Staff - March 10, 2022 / 08:48 PM IST

Radhe shyam: రాధే శ్యామ్‌కి హిందీలో నిరాశ‌.. తొలి రోజు త‌క్కువ వ‌సూళ్లు రానున్నాయా..

 

Radhe shyam: సాహో చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా కోసం అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు రేపు ఈ మూవీ విడుద‌ల కానుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాని విడుద‌ల చేయ‌బోతున్నారు మేక‌ర్స్. అయితే హిందీలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఆ త‌ర్వాత సాహో చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌లో నిరాశ పర‌చిన హిందీలో మాత్రం దుమ్ము రేపింది. ఆ సినిమా హిందీ లో పెట్టిన పెట్టుబడులకు లాభాలను అందించి బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్ సర్దుకుంది. ప్ర‌భాస్ క్రేజ్ దృష్ట్యా రాధే శ్యామ్ సినిమా కూడా తప్పకుండా హిందీలో మంచి కలెక్షన్స్ రాబడుతుంది అని మొదటి నుంచి కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 Radhe shyam movie

Radhe shyam movie set

ఇక సినిమా అక్కడ సక్సెస్ అవ్వాలని ప్రత్యేకంగా కొన్ని పాటలను కూడా హిందీ ఆడియన్స్ కి నచ్చే విధంగా కంపోజ్ చేయడం విశేషం. ఏకంగా ముగ్గురు బాలీవుడ్ కంపోజర్స్ కు కోట్ల రూపాయలు ఇచ్చి సాంగ్స్ రెడీ చేయించారు. తప్పకుండా హిందీ లో మొదటి రోజే సినిమా మంచి వసూళ్లను అందుకుంటుంది అని ఆడియేన్స్ కూడా నమ్మారు.

తెలుగు రాష్ట్రాల‌లో అడ్వాన్స్ బుకింగ్ బాగానే అవుతున్నా, హిందీలో మాత్రం చాలా తక్కువ స్థాయి లో అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతుండడం విశేషం. సాహో సినిమాకు కూడా బాహుబలి రేంజ్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్రభాస్ సోలో గా కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నట్లు అర్థమైంది. కానీ రాధే శ్యామ్ కు మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

Prabhas Radheshyam interesting news

Prabhas Radheshyam interesting news

సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు లేవ‌ని మేక‌ర్స్ ముందుగా క్లారిటీ ఇవ్వ‌డంతో నార్త్ ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలుస్తుంది. కేవలం పాజిటివ్ టాక్ వస్తేనే రాధే శ్యామ్ సినిమాకు మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది అని అనిపిస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us