Chandrababu : రెండెకరాల నుంచి 20 వేల కోట్ల ఆస్తి పెంచుకున్న చంద్రబాబు..!
NQ Staff - September 25, 2023 / 02:31 PM IST

Chandrababu :
చంద్రబాబు ప్రతిసారి ఒక మాట చెబుతుంటారు. తాను రెండెకరాల రైతును అని.. తన పేర మీద ఎలాంటి కంపెనీలు, ఆస్తులు లేవని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఆయన స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఏపీలో భువనేశ్వరి తిరుగుతున్నారు. తన భర్తకు మద్దతు కూడగట్టేందుకు పడరాని పాట్లు పడుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ చోట మాట్లాడారు. నా భర్త ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఓ కంపెనీని నడుపుతున్నాను. అందులో 2 శాతం వాటా అమ్ముకున్నా సరే నాకు రూ.400 కోట్ల ఆస్తి వస్తుంది అని చెప్పారు. దాంతో అది విన్న వారంతా షాక్ అవుతున్నారు.
కేవలం 2 శాతం అమ్మితేనే రూ.400 కోట్లు వస్తే.. ఇక మొత్తం వాటా అమ్మితే ఏకంగా రూ.20 వేల కోట్లు వస్తుందన్నమాట. అంటే చంద్రబాబు ఆస్తులు ఇంత పెరిగాయా అని షాక్ అవుతున్నారు. రాజకీయాల్లో ఏమీ సంపాదించుకోలేదని చెబుతున్న చంద్రబాబుకు రూ.20 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.
రెండెకరాల రైతు నుంచి రూ.20వేల కోట్ల ఆస్తుల వరకు చంద్రబాబు ఎలా ఎదిగారనేది ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రశ్న. అంటే ఇది కూడా నా పేరు మీద లేదని బుకాయించడం చంద్రబాబుకు అలవాటే అనుకోండి. కానీ చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయకుండానే ఇంత సొమ్ము సంపాదించాడంటే నమ్మశక్యం కావట్లేదని అంటున్నారు ఏపీ ప్రజలు.