AKHIRA: అకీరా ఎంట్రీపై మ‌రోసారి రేణూకు ప్ర‌శ్న‌.. స్ట‌న్నింగ్ ఆన్స‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ మాజీ భార్య‌

పవ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. క‌రోనా ప‌రిస్థితుల‌పై అనేక అధ్య‌య‌నాలు చేస్తున్న రేణూ దేశాయ్ తన అభిమానులతో లైవ్ కార్యక్రమంలో ముచ్చటించారు. లైవ్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. నెటిజ‌న్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ముక్కుసూటిగా బ‌దులిచ్చిన రేణూ తాజాగా త‌న కుమారుడు అకీరా ఎంట్రీపై మ‌రోసారి స్పందించింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణుదేశాయ్ దంపతులకు అకిరా – ఆద్య అనే పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అకీరాని పవర్ స్టార్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇలా పిల‌వ‌డం రేణూ దేశాయ్‌కి ఏ మాత్రం ఇష్టం లేదు. త‌న కుమారుడికి సినిమాల‌పై ఆస‌క్తే లేద‌ని ప‌లుమార్లు చెప్పుకొచ్చింది రేణూజ‌. రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాతో అకిరా తెరపై కనిపించగా, హీరోగా ఆయ‌న ఎంట్రీ ఎప్పుడు ఉంటుంద‌ని నెటిజ‌న్స్ ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానం ఇచ్చిన రేణూ దేశాయ్ .. ప్రస్తుతం అందరం కరోనా కారణంగా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో అకిరా డెబ్యూ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. నా పిల్ల‌ల‌ని ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నానో, మీ పిల్ల‌ల‌ని కూడా అంతే జాగ్ర‌త్త‌గా చూసుకోండ‌ని రేణూ పేర్కొంది.