ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎన్నిరోజులు క్వారంటైన్ లో ఉంటారో తెలుసా!

Advertisement

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు క్వారంటైన్ లో ఎన్ని రోజులు ఉండాలన్న విషయంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ను పూర్తి చేసుకోవడంతో ఆ రెండు జట్టులోని పలువురి ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు నేరుగా దుబాయ్ వస్తున్నారు దీంతో వారు 6 రోజులు క్వారంటైన్ బదులు 36 గంటలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐపీఎల్ ఉన్నతాధికారి తాజాగా మీడియాకు వెల్లడించారు.

ఇలా చేయడంతో అన్ని జట్లూ తమ ప్రధాన ఆటగాళ్లను తొలి మ్యాచ్ నుంచే ఆడించే అవకాశం కలిగిందని ఆయన అన్నారు. ఈ ఆటగాళ్లంతా ఇంగ్లాండ్లో బయలుదేరే ముందు ర్యాపిడ్ టెస్టులు చేసుకున్నారని, ఇక్కడికి వచ్చాక కూడా టెస్టులు నిర్వహిస్తారని చెప్పారు. అయితే, ఈ రెండు జట్లూ అక్కడ కూడా బయోబబుల్ లో ఉన్నందునే వీరికి తక్కువ సేపు క్వారంటైన్ గడువును కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇప్పటివరకు ఐపీఎల్ తొలి మ్యాచ్ లకు విదేశీ ఆటగాళ్లు దూరమవుతున్నారని బాధ పడిన ఐపీఎల్ అభిమానులు బీసీసీఐ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 6 రోజుల క్వారంటైన్ రూల్ తో కొంతమంది స్టార్ ఆటగాళ్లు పలు జట్ల తోలి మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉండేది, బీసీసీఐ తాజా నిర్ణయంతో వారు కూడా తమ తమ లు ఆడేందుకు మార్గం సుగమం అయింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here