పీవీ సింధు బయోపిక్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ?

Advertisement

సినీ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ కు సంబందించిన బయోపిక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇప్పటికే కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగాట్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, స్ప్రింటర్ మిల్కా సింగ్, బాక్సర్ మేరీకోమ్, వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలు కూడా సాధించాయి.ఇదే క్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిని, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు బయోపిక్‌ కూడా త్వరలో తేరా మీదకు రానుంది.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే మొదట్లో ఈ బయోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా సమంత అక్కినేని ఈ బయోపిక్ లో నటించబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాను సోనూ సూద్ నిర్మిస్తున్నాడు. ఆయన స్పందిస్తూ దీపికా మాత్రమే ఈ కథకు న్యాయం చేస్తుందని, ఆమెకు డేట్స్ కుదిరినపుడే ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తామని స్పష్టం చేసాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here