“పుష్ప” స్మగ్లింగ్ అంతా… తెలంగాణ జిల్లాల్లోనే..!

Advertisement

టాలీవుడ్ లో రంగ స్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తో ప్రేక్షకుల్ని ఉర్రుతలాడించాడు డైరెక్టర్ సుకుమార్. ఈ రంగస్థలం సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం అల్లు అర్జున్ తో బారి స్థాయి తో పాన్ ఇండియా మూవీ గా “పుష్ప” ని తెరకెక్కిస్తున్నాడు … దీనితో ప్రేక్షకులు ఇప్పటికే ఈ సిసినిమా పైన బారి అంచనాలు పెట్టేసుకున్నారు.

తాజాగా పుష్ప సినిమా ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా ఈ పోస్టర్ లో అల్లుఅర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినీమా లో హీరోయిన్ ను కూడా ఖరారు చేసారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందాన నటించబోతుంది. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఈ పుష్ప సినిమా లో అల్లు అర్జున్ రాయలసీమ చిత్తూరు బాషా , యాస తో పాటు ఓ మొరటు కుర్రోడిలా ఇరగదీయనున్నాడు. అంతే కాదు ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింయిగ్ నేపథ్యంలో రూపొందిస్తుండగా ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా ఉరమాస్ పాత్ర లో నటించనున్నాడు. ఇదంతా చూస్తుంటే సుకుమార్ మల్లి పెద్ద హిట్ కొట్టేలాగే కనిపిస్తుంది .

అయితే ఈ పుష్ప సినిమాలో అటవీ శాఖ అధికారి గా విజయ్ సేతుపతి నటించనున్నారు అని ఇప్పటికే వార్తలు బయటికి వస్తున్నాయి… లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ని మరల ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు పుష్ప చిత్ర బృందం. ప్రధానంగా ఈ సినిమా షూటింగ్ ని మహబూబ్ నగర్ లోని అడవి ప్రాంతం లో ఉన్న ఘాట్ లో నిర్వహించనున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా అక్కడ షూటింగ్ పూర్తి అవ్వగానే రామోజీ ఫిలిం సిటీ లో పెద్ద సెట్స్ వేయనున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు తక్కువ మంది తో నే ఈ షూటింగ్ జరపనున్నారు అంట.

ఇలా తక్కువ మంది ఉన్నపుడే బన్నీ, రష్మిక ల మధ్య ఓ పాట కూడా తియనున్నారని సమాచారం. అంతే కాదు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ వ్యవహరిస్తుండగా… ఈ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్ ఈ సీనిమా కు మరింత హైలైట్ గా నిలవనుంది.. బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌత్ ఈ ఐటెం సాంగ్ కు స్టెప్పులేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రేక్షకుల్లో బారి స్థాయి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా మరి ఆ అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here