Puri Jagannadh : కేజీఎఫ్ స్టార్ యష్ తో పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ?
Ajay G - May 21, 2021 / 01:30 PM IST

Puri Jagannadh : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే తోపు డైరెక్టర్ ఆయన. పూరీ తీసిన సినిమాల్లో దాదాపుగా అన్నీ యూత్ కు నచ్చేవే. ఆయన సినిమాలో ప్రేమతో పాటు మాస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎంతైనా తెలుగు సినిమా చరిత్రలో పూరీ జగన్నాథ్ కు కొన్ని ప్రత్యేక పేజీలు ఉంటాయి. తెలుగు సినిమాను మూస ధోరణి నుంచి తప్పించి.. సరికొత్త సినిమాలను తీసి ట్రెండ్ సృష్టించింది పూరీ జగన్నాథే. సినిమాలో ఐటెమ్ సాంగ్ కు రూపకర్త కూడా ఆయనే.

puri jagannadh pan india movie with kgf hero yash
తన సినిమాల్లో హీరోను ఒక రోమియోగా, పోకిరిగా, ఇడియెట్ గా చూపిస్తాడు పూరీ. తన సినిమాలోని హీరోయిన్ కు కూడా మంచి పాత్ర ఇస్తుంటాడు. గ్లామర్ విషయంలో కూడా ఎటువంటి డోకా ఉండదు. మొత్తం మీద పూరీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ. ఒకప్పుడు తెలుగు సినిమా చరిత్రలోనే రికార్డులను బద్దలు కొట్టిన పోకిరి లాంటి సినిమాకు దర్శకత్వం వహించిన ఘనత పూరీది.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో లైగర్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా మూవీ. దాదాపుగా అన్ని భాషల్లో విడుదల అవుతోంది. ఆ సినిమా కోసం పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో మకాం వేశారు. అక్కడే సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో లైగర్ సినిమా తర్వాత పూరీ.. కేజీఎఫ్ స్టార్, కన్నడ హీరో యష్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట.

puri jagannadh pan india movie with kgf hero yash
ఇటీవలే హీరో యష్ ను కలిసి.. పూరీ స్టోరీ వినిపించారట. ఆ స్టోరీ విని.. యష్ ఇంప్రెస్ అవడంతో పాటు.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ప్రస్తుతం యష్.. కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి కాగానే.. పూరీ సినిమాను పట్టాలకెక్కించే ప్రయత్నంలో ఉన్నారట. ఏది ఏమైనా.. పూరీ జగన్నాథ్.. కేజీఎఫ్ స్టార్ తో జత కడుతున్నారంటే మామూలు విషయం కాదు. అది కూడా పాన్ ఇండియా మూవీ. చూద్దాం మరి.. ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో?