Puri Jagannadh: ముంబైలో పూరీని చూసి ఫుల్ ఎమోష‌న‌ల్ అయిన అభిమాని

Puri Jagannadh సినిమా ఇండస్ట్రీలో డైనమిక్ డైరెక్టర్లు చాలా అరుదు. ఆ లిస్ట్‌లో బెస్ట్ అనిపించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. డాషింగ్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న పూరీ జ‌గ‌న్నాత్ ఈ త‌రంవారికి ఇన్స్ స్పైరింగ్ డైరెక్టర్. పేజీల కొద్దీ డైలాగ్స్ పెట్టొచ్చు అనే చోట సింపుల్ డైలాగ్స్‌తో శెభాష్ అనిపిస్తాడు. ఇదే పూరీని స్పెషల్ డైరెక్టర్ గా మలిచింది.

తొలినాళ్లలో దూరదర్శన్ లో దర్శకుడిగా పనిచేశాడు పూరీ జగన్నాథ్. మొదట్లో, సుమన్, కృష్ణ లాంటి వారితో సినిమాలు అనుకున్నాడు. కృష్ణతో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయింది. కానీ ఏవో కారణాలతో ఆగిపోయింది. పూరి జగన్నాథ్ ముంబై లో లైగర్ చిత్రం పనుల్లో బిజిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ముంబై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పూరి జగన్నాథ్ వాహనం ఆగగా, ఒక అభిమాని పూరి వద్దకు వచ్చి షాక్ కి గురయ్యాడు. తను తెలుగు వాడినని, టీఎస్ వాహనం చూసి, మన తెలుగు వాళ్ళు అని అనుకున్నా అని, కాకపోతే పూరి జగన్నాథ్ ను చూడటం తో సంతోషం వ్యక్తం చేశారు. పూరి జగన్నాథ్ కి తను పెద్ద అభిమాని ను అంటూ చెప్పుకొచ్చారు

అభిమానిని ఎంటి అని పూరి అడగగా, ప్రమోద్ అంటూ చెప్పుకొచ్చారు. తన దగ్గర ఫోన్ లేకపోవడం తో సెల్ఫీ తీసుకోవడం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈ సంభాషణ ను నటి ఛార్మి కౌర్ రికార్డ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఈ వీడియో తన కోసమే అంటూ చెప్పుకొచ్చారు. లైగర్ సినిమా సమ్మర్ లో వస్తుంది తప్పకుండా చూడు అంటూ పూరి జగన్నాథ్ అడగగా, ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా ఈ చిత్రం లో నటిస్తున్నారు.