BIGG BOSS : హాట్ టాపిక్‌గా మారిన బిగ్ బాస్ బ్యూటీ టాటూ.. అర్ధం ఏంటా అంటూ సోషల్ మీడియాలో చర్చ
Samsthi 2210 - March 20, 2021 / 02:40 PM IST

BIGG BOSS :బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్‌పుల్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్యూటీస్ అందరు సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకోగా, వారు తమ అందచందాలతో అభిమానులని తెగ ఊరిస్తున్నారు. వీరి ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో పాల్గొన్న బబ్లీ భామ పునర్నవి.. రాహుల్ సిప్లిగంజ్‌తో కాస్త క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు వీరిద్దరి మధ్య ఏడో నడుస్తుందనే అనుమానం అభిమానులలో కలిగింది.
బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక పునర్నవి హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ యువతను కవ్వించే ప్రయత్నం చేస్తుంది. లాక్డౌన్ నుండి తన సోయగాలకు మెరుగులు దిద్దేపనిలో పడింది. ప్రస్తుతం పునర్నవి చేతిలో ఆఫర్స్ పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా హాట్ ఫోటోలతో అభిమానులకు వినోదం పంచుతుంది. తాజాగా పునర్నవి మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. వీపు సౌందర్యం చూపుతూ ఫోటోకు పోజిచ్చిన ఈ అమ్మడు అభిమానులని కన్ఫ్యూజ్ కూడా చేసింది.
రీసెంట్‌గా పునర్నవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేయగా, ఈ ఫొటోలో తన మోచేతిపై ఉన్న టాటూని చూపించింది. వీపు సౌందర్యంతో పాటు టాటూ నెటిజన్స్ మతులు పోగొట్టగా, ఆ టాటూ అర్ధం ఏంటా అని కనుక్కునే ప్రయత్నం చేశారు. పుష్పంలా కనిపిస్తున్న ఈ టాటూ అర్ధం తెలుసుకోవాలని ఆమె అభిమానులు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. కాగా, పునర్నవి చివరిగా కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.