Punjab National Bank ATM : వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన ఏటీఎం. అందులో ఎంత డ‌బ్బు ఉందో తెలిస్తే అవాక్క‌వుతారు?

NQ Staff - August 12, 2022 / 08:08 PM IST

151049Punjab National Bank ATM : వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన ఏటీఎం. అందులో ఎంత డ‌బ్బు ఉందో తెలిస్తే అవాక్క‌వుతారు?

Punjab National Bank ATM : ఉత్తరాఖండ్ లో మరోసారి వరదలు వణికిస్తున్నాయి.ఊహించ‌ని వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కి గుర‌వుతున్నారు. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న‌ భారీ వ‌ర్షాలతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థం అయింది. ఉత్త‌ర‌కాశీ జిల్లా పురోలాలో కుమోలో న‌ది ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌ట్ట‌ణంలో ఉన్న ఎనిమిది దుకాణాలు న‌దీ ప్ర‌వాహంలో కొట్టుకు పోయాయి.వాటిలో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉంద‌ని అధికారులు తెలిపారు.

వ‌ర‌ద ప్ర‌వాహం..

ఆ ఏటీఎంలో రూ.24 లక్షల నగదు ఉందని అధికారులు తెలిపారు. ఏటీఎంతో పాటు ఈ వరదల్లో పలు నగల షాపులు కూడా కొట్టుకు పోయాయి. దీంతో యజమానాలు లబోదిబోమంటూ విలపిస్తున్నారు. పురోలా పట్టణంలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. ఏటీఎం నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Punjab National Bank ATM Washed in Kumolo River

Punjab National Bank ATM Washed in Kumolo River

ఈ ఏటీఎంలో డబ్బులు ఉంచిన తరువాత కొద్ది మంది కస్టమర్లు మాత్రమే నగదు డ్రా చేసి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా నగదు అంతా వరదపాలు అయినట్టేని భావిస్తున్నారు. గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా కుమోల నదికి అకస్మాత్తుగా వరద పెరగడంతో తీరానికి దగ్గరగా ఉన్న దుకాణాలు కొట్టుకుపోయాయి.

వాటిలో రెండు నగల దుకాణాలు కూడా ఉన్నాయి. నదికి వరద ఇంకా పెరిగే అవకాశాలున్నాయని,పలు నివాసాలు, దుకాణాలకు ఇప్పటికీ ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది.