Puducherry : ‘పూజలు’ చేయడానికి మహిళా ఉద్యోగులకు రెండు గంటల స్పెషల్ పర్మిషన్.. ఎక్కడంటే?

NQ Staff - April 29, 2023 / 02:04 PM IST

Puducherry : ‘పూజలు’ చేయడానికి మహిళా ఉద్యోగులకు రెండు గంటల స్పెషల్ పర్మిషన్.. ఎక్కడంటే?

Puducherry : పుదుచ్చేరి లో అధికారులు తీసుకున్న నిర్ణయానికి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఒక ప్రత్యేక అనుమతి అందరికి సంతోషంగా అనిపిస్తుంది. ఇంతకీ పుదుచ్చేరి గవర్నమెంట్ ప్రకటించిన ఆ ప్రత్యేక అనుమతి ఏంటి అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. మహిళలకు అనేక పని ఒత్తిడులు ఉంటాయి..

మరీ ముఖ్యంగా ఇంట్లో ఉండే వారి కంటే ఉద్యోగం చేసే మహిళలు మరిన్ని ఒత్తిడులను ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి మహిళా సిబ్బంది ఇబ్బందులను కొద్దిగా తేలిక చేయడానికి తాజాగా పుదుచ్చేరి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం హర్షం వ్యక్తం చేసేలా చేస్తుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళా సిబ్బందికి శుక్రవారం ఉదయం 8.45 గంటలకు కాకుండా 10.45 గంటలకు కార్యాలయానికి రావాలని తెలిపారు.

ఈ రెండు గంటల ప్రత్యేక అనుమతి ఇళ్లలో పూజలు చేసి కార్యాలయానికి రావడం కోసం అని అందుకే ఈ రెండు గంటల అనుమతి పొందవచ్చని మహిళా సిబ్బందికి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం లో ఏప్రిల్ 28న శుక్రవారం మహిళా సిబ్బందికి పూజలు చేయడానికి వీలుగా రెండు గంటల ప్రత్యేక అనుమతి మంజూరు చేసినట్టు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు నెలలో మూడు శుక్రవారాల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. అయితే విద్యా, పోలీస్, ఆసుపత్రి వంటి అత్యవసరమైన సేవలకు ఈ ప్రత్యేక అనుమతి లేదని తెలిపింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆడవారు సమయంతో పోటీ పడకుండా ఇంట్లోనే పూజలు చేయడానికి ప్రత్యేకంగా రెండు గంటల అనుమతి ఇవ్వబడుతుంది.. అని తెలిపారు..

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us