Project K Story : ప్రాజెక్ట్ కే స్టోరీ ఇదే.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!

NQ Staff - July 21, 2023 / 01:31 PM IST

Project K Story : ప్రాజెక్ట్ కే స్టోరీ ఇదే.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!

Project K Story : ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ అంటూ హైప్ ఇస్తూ స్టార్టయింది ప్రాజెక్ట్ కే. అనౌన్సయిన నాటినుంచే అంచనాలు పెంచేస్తూ టైటిట్, కాస్ట్ అండ్ క్రూ దగ్గర్నుంచీ స్టోరీ లైన్, థీమ్, జానర్.. ఇలా ప్రతి ఎలిమెంట్ లోనూ ఆడియెన్స్ లో ఎగ్జయిట్మెంట్ పెంచుతూ వస్తోంది మూవీ టీమ్. ప్రభాస్, దీపికా పదుకునేతో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కూడా నటిస్తున్నారని అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడ ప్రాజెక్ట్ కే మానియా స్టార్టయిపోయింది.

ఇక లేటెస్ట్ గా రిలీజైన గ్లింప్స్ తో ప్రాజెక్ట్ కే రేంజ్ అండ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నాగ్ అశ్విన్ అండ్ టీమ్, టెక్నికల్ పరంగా భారీ ఇంపాక్ట్ కోసం గట్టిగానే కష్టపడుతున్నారని కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ను అలరించేందుకు రొటీన్ స్టోరీతో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారన్న నమ్మకాన్ని కలిగించిందీ గ్లింప్స్. మరోవైపు అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటి, థీమ్ ఏంటి అన్న డౌట్స్ కి కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రాజెక్ట్ కే 2898 ఏడీ అంటూ అనౌన్స్ చేసిన టైటిల్ లో కే ఫర్ కల్కి అని రివీల్ చేశారు.

కల్కిని విష్ణు మూర్తి పదకొండో అవతారంగా చెప్పుకుంటారు. మానవాళికి అపాయం వచ్చినప్పుడు, ఆధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్ధాపించేందుకు ఒక్కో యుగంలో దేవుడు ఒక్కో అవతారంలో వస్తాడని చెప్తున్నాయి పురాణాలు. అలాగే కలియుగంలో 2898వ సంవత్సరంలో ఒక చెడు శక్తి ఉద్భవించి భూమి మొత్తాన్ని అధీనంలోకి తీసుకోవాలని చూస్తుంటుంది. ప్రపంచం మొత్తాన్ని తన చెప్పుచేతల్లోకి రాబట్టుకోవాలనుకుంటుంది. అలాంటి సమయంలో ఒకరొచ్చి ఆ చెడు శక్తి నుంచి కాపాడతారని అందరూ విశ్వశిస్తుంటారు. అలా వచ్చి కాపాడే కల్కినే ప్రభాస్ అంటూ ఈ స్టోరీపై స్పెక్యులేషన్స్ ఆల్రెడీ స్టార్టయిపోయాయి. ఇదే ఈ మూవీ స్టోరీ లైన్ అని డీకోడ్ చేస్తూ సోషల్మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Project K Story

Project K Story

ఈ టాక్స్ కి బలం చేకూరేలా మరిన్ని పాయింట్స్ ని కూడా డీకోడ్ చేస్తున్నారు మూవీ లవర్స్. కల్కిని ఓడించి వాళ్ల దారిని అడ్డురాకుండా చేసుకుని, ప్రపంచాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి దుష్ట శక్తులకు విష్ణు ఆయుధాలు కావాల్సి వస్తుంది. వాటిని పొందడానికి వాళ్లు చేసే ప్రయత్నాల్ని కల్కిగా ప్రభాస్ ఎలా అడ్డుకున్నాడనేదే సినిమాలో మెయిన్ పాయింట్ గా కనిపిస్తోంది. విష్ణుమూర్తి తన నాలుగు చేతుల్లో ఒక్కో ఆయుధాన్ని ధరించి ఉంటాడు. అవే శంఖం, చక్రం, గధ, పద్మం. శంఖం కమ్యునికేషన్ కి సింబలైతే, చక్రాన్ని వీల్ ఆఫ్ టైమ్ గా, గధని ధర్మాన్ని ఆచరించమని సూచించేదిగా, పద్మం ఆనందపు మకరందానికి ప్రతీకగా చెప్తుంటారు. వీటిల్లో ప్రధానమైంది గద. దాని పేరే కౌమోదకి గద. మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం ఖాండవవనంలో వరుణదేవుడు ఈ గదని శ్రీక్రిష్ణుడికి ఇచ్చాడని చెప్తుంటారు. ఎంత బలమైన శక్తినైనా ఎదుర్కునే సామర్థ్యం దీనికుందని ప్రతీతి. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. విష్ణు మూర్తిలాగే గదా దేవి అయిన దీపికా పడుకునే కూడా మరో అవతారం ఎత్తి కల్కికి సాయపడుతుంది. గదాదేవికి సృష్టి ఆది నుంచి ఉన్న పూర్వ జ్ఞానం ఉండడంతో కల్కి ప్రేమ పొందడంతో పాటు చెడు శక్తులనుంచి పోరాడడంలో ఆయనకి సహాయపడుతుందంటూ అనలైజ్ చేస్తున్నారు కొందరు.

విష్ణుమూర్తి ప్రధాన ఆయుధం చక్రం.. అదే సుదర్శన చక్రం. బ్రహ్మ కుమారుడైన విశ్వకర్మ తయారుచేసిన ఈ చక్రం ఎంతటి శక్తినైనా అంతం చేయగలదు. ప్రభాస్ కల్కి కాబట్టే ఆ ఆయుధం కూడా తన దగ్గరనున్నట్టు ఓ షాట్ లో చూయించారు. ముఖ్య ఆయుధైనా దీన్ని దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడతాడనే పాయింట్ కూడా ఉండొచ్చని మరో డీకోడింగ్ పాయింట్.

ఇక మరో మెయిన్ ఎలిమెంట్ ధర్మాన్ని సూచించే పద్మం. ఇది ఆయుధం కాదు గానీ.. ఆయుధాలకి సంబంధించిన సూత్రాలన్నీ ఇందోలనే పొందుపర్చి ఉంటాయి. గ్లింప్స్ లో కూడా పద్మాన్ని పోలిన గుర్తుతో ఓ ప్లేస్ ని చూయించారు. దుష్ట శక్తులు నాశనం చేయడానికి వచ్చినప్పుడు కల్కి ఎదుర్కొని పోరాడతాడు అనే లైన్ కూడా ఉండొచ్చు. గ్లింప్స్ లో చూయించిన షాట్స్ అండ్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని ఇలాంటి డీకోడింగ్ పాయింట్స్ అయితే ప్రజెంట్ సోషల్మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

నిజానికి ఇలా నెగిటివ్ పవర్స్ నుంచి ప్రజల్నో, ఓ ప్రాంతాల్నో కాపాడే హీరో కథలు చాలానే వచ్చాయి. కాస్త విజువల్ ఎఫెక్ట్స్ తో, గ్రాండియర్ గా తెరకెక్కి కోట్లు కొల్లగొట్టిన హాలీవుడ్ సినిమాలు కోకొల్లలు. మరి ప్రాజెక్ట్ కే కూడా అదే ఫార్ములాను నమ్ముకుంటే వర్కవుటవుతుందా అంటే.. ఇక్కడే నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీకి పనిచెప్పాడు. ఎంత టెక్నాలజీని నమ్మకున్నా, లెక్కకు మించి బడ్జెట్ ఖర్చుపెట్టినా, లక్షలాది ఫ్యాన్స…

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us