వృత్తి స‌మోసాలు అమ్మ‌డం.. సంపాద‌న కోట్ల‌లో..!

చూడ‌టానికి స‌న్న‌గా ఉంటుంది, కాని ముట్టుకుంటే మాడి మ‌సి అయిపోతారనే సినిమా డైలాగ్ ఉంది కదా, అలానే చిన్న వ్యాపారులు అనుకుంటారేమో, కాని కొంద‌రు సంపాదించ‌న సంపాద‌న కోట్ల‌లో ఉంది. వారి పేర్ల మీద ఉన్న ఆస్తులు తెలిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే. అయితే వారు అక్ర‌మంగా సంపాదించిన‌వి కాదు. స‌మోసాలు, చాట్‌లు అమ్మి క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌వే. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని చిరు వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ తాజాగా జరిపిన దాడుల్లో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి.

తాజాగా చిరు వ్యాపారుల‌పై ఐటీ శాఖ దాడులు చేయ‌గా, వీరి ఆదాయం ఏడాదికి కోట్ల‌లో ఉంద‌ని రుజువైంది. కొంద‌రైతే ఒక‌టి క‌న్నా ఎక్కువ కార్లు మెయింటైన్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రి ద‌గ్గ‌ర ఖ‌రీదైన బంగ్లాలు ఉన్నాయి. ఇంకొంద‌రికి వంద‌ల ఎక‌రాల్లో సాగు ఉంది. వీరు ఎవ‌రు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించడం లేదు. క‌నీసం జీఎస్టీ ప‌రిధిలో కూడా లేరు.

కోట్ల ఆస్తులు కూడ‌గ‌ట్టుకున్న వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. 256 మంది వ్యాపార‌లు గత నాలుగేళ్లలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని మాయ చేయడానికి కొందరు వ్యాపారలు సహాకర బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ తాము పేద వాళ్లమని నమ్మిస్తున్నారని, మరికొందరు బంధువుల పేర్లతో ఆస్తులు కొంటున్నారని ఐటీ శాఖ దర్యాఫ్తులో తేలింది.

ఐటీ శాఖ వీరిపై పూర్తి నిఘా పెట్టి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ప‌రిశీలించి ఆస్తుల వివారాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌స్తుతం ఈ వార్త అంత‌టా వైర‌ల్‌గా కాగా, నెటిజ‌న్స్ నోరెళ్ల‌పెడుతున్నారు.