Adipurush : ‘ఆదిపురుష్’ ని అలా తీసి ఉంటే ఎవరు చూసి ఉండేవారు కాదు
NQ Staff - June 19, 2023 / 08:33 PM IST

Adipurush : ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ను వక్రీకరించే విధంగా ఈ సినిమాలోని సీన్స్ మరియు డైలాగ్స్ ఉన్నాయి అంటూ చాలా మంది హిందు సంఘాల వారు ఆందోళన చేస్తున్నారు.
ఈ నేపథ్యం లో సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒక నిర్మాత స్పందిస్తూ ఆదిపురుష్ ను తరం ప్రేక్షకులకు ముఖ్యంగా పిల్లలకు అర్థం అయ్యే విధంగా రూపొందించాం. అందుకే కొన్ని చోట్ల కల్పితంను జోడించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు.
ఒకప్పటి మాదిరిగా పద్యాలు.. మూస పోకడలతో సినిమాను రూపొందించి ఉంటే కచ్చితంగా కొత్తగా తీస్తే ఏమైంది అంటూ విమర్శించే వారు. కనుక ఇలాగే సినిమాను తీయడం మంచిది అన్నట్టుగా తాము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం అన్నాడు.
ఆదిపురుష్ సినిమా యొక్క నెగటివ్ టాక్ కు ఆయన చెప్పిన సమాధానం విడ్డూరంగా వింతగా ఉందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. రామాయణం ను వక్రీకరించి.. దాన్ని పిల్లల కోసం అంటూ కవర్ చేయడం మరింత విచిత్రంగా ఉందని అంటున్నారు.