Producer KP Chowdary : డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కబాలి నిర్మాత.. సినీ ఇండస్ట్రీలో కలకలం..!
NQ Staff - June 14, 2023 / 12:17 PM IST

Producer KP Chowdary : సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గతంలో చాలామంది టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోయిన్లు ఈ డ్రగ్స్ విషయంలో గతంలో విచారణ ఎదుర్కున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరోసారి డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను సరఫరా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో భాగంగా డ్రగ్స్ వినియోగిస్తున్న సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కబాలి సినిమాను నిర్మించారు.
ఆయన కొంత కాలంగా గోవాలో ఉన్నారు. ఆయన వద్ద నుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.