Priyanka Jain : అందుకే పెళ్లి చేసుకోకుండా డేటింగ్ చేస్తున్నాం.. ప్రియాంక జైన్ పచ్చి కామెంట్లు..!

NQ Staff - February 4, 2024 / 11:33 AM IST

Priyanka Jain  : అందుకే పెళ్లి చేసుకోకుండా డేటింగ్ చేస్తున్నాం.. ప్రియాంక జైన్ పచ్చి కామెంట్లు..!

Priyanka Jain  :

బిగ్ బాస్ తో చాలామంది సెలబ్రిటీలు అవుతున్నారు. అప్పటి వరకు పెద్దగా బయటి ప్రపంచానికి తెలియని వారు కూడా ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు. ఇక తెలుగు నాట బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చివరగా బిగ్ బాస్ సీజన్-7 షో జరిగింది. సీజన్-7 కు గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ సొంతం అయిపోయింది. అంతకు ముందు జరిగిన రెండు సీజన్లు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ సీజన్-7 మాత్రం ఓ రేంజ్ లో హిట్ అయింది. ఈ సారి ఎవరూ ఊహించని విధంగా ఒక కామన్ మ్యాన్ అయిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ప్రశాంత్ విన్నర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు.

దాంతో ఈ సీజన్ చాలా బాగా హిట్ అయింది. ఇక ఫైనల్ వరకు వెళ్లిన వారిలో లేడీ కంటెస్టెంట్ కేవలం ప్రియాంకజైన్ మాత్రమే ఉన్నారు. ఆమె తన ఆటతీరుతో చాలానే ఆకట్టుకుంది. ఇక ఆమె హౌస్ లో ఉన్నప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ శివకుమార్ కూడా వచ్చాడు. కెమెరాలు ఉన్నాయని కూడా చూడకుండా ఇద్దరూ రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేశారు. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. ఇక హౌస్ లో ఉన్నప్పుడు మనం పెళ్లి చేసుకుందామని శిను అడిగింది ప్రియాంక. దానికి శివ కుమార్ కూడా బయటకు రాగానే చేసుకుందాం అని చెప్పాడు. అయితే వీరిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోలేదు.

వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇలా కలిసి సహజీవనంచేయడంపై చాలానే విమర్శలు వస్తున్నాయి. ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే దానిపై తాజాగా ప్రియాంక, శివకుమార్ తాజాగా స్పందించారు. వారిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రియాంక మాట్లాడుతూ.. పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందులోనూ నాకు పెళ్లి చాలా గ్రాండ్ గా చేసుకోవాలని ఉంది. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకుంటాం. అందుకే పెళ్లికి చాలా డబ్బులు కావాలని నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు.

Priyanka Jain Talked About Dating her Boyfriend Shivakumar

Priyanka Jain Talked About Dating her Boyfriend Shivakumar

మా ఇద్దరి దగ్గర అందుకు సంబంధించిన డబ్బులు లేవు. అందుకే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాం అని చెప్పుకొచ్చింది. అయితే ఇలా కలిసి ఉంటే మీ ఇంట్లో వారు ఏమీ అనట్లేదా అని యాంకర్ ప్రశ్నించింది. దానికి ప్రియాంక మాట్లాడుతూ.. మేమిద్దరం ఇంట్లో వారి అంగీకరాంతోనే కలిసి ఉంటున్నాం.

ఇందులో మాకు ఇద్దరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ విమర్శలకు చెక్ పెట్టడం కోసం రిజిస్టర్ చేసుకోవాలనే ఆలోచన కూడా చేశాం. కానీ అది వర్కౌట్ కాలేదు అంటూ తెలిపింది ప్రియాంక జైన్. అయితే ఆమె చెప్పిన రీజన్ అందరికీ చాలా వింతగా అనిపిస్తోంది. పెళ్లికి డబ్బులు లేవని ఇలా సహజీవనం చేయడం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us