Priyanka Jain accuses Shivaji : హౌస్ లో ఇంజెక్షన్ పిల్స్ వాడా.. నేను విన్నర్ కావాల్సింది.. ప్రియాంక జైన్ సంచలనం..!

NQ Staff - February 3, 2024 / 01:14 PM IST

Priyanka Jain accuses Shivaji : హౌస్ లో ఇంజెక్షన్ పిల్స్ వాడా.. నేను విన్నర్ కావాల్సింది.. ప్రియాంక జైన్ సంచలనం..!

Priyanka Jain accuses Shivaji : బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక దీనికి మన తెలుగు నాట కాస్త ఎక్కువ మందే ఫ్యాన్స్ ఉన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ బిగ్ బాస్ ను చూస్తూనే ఉంటారు. ఇక చివరగా జరిగిన బిగ్ బాస్ సీజన్-7 దుమ్ము లేపింది. గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ దీనికి వచ్చింది. అంతకు ముందు జరిగిన రెండు సీజన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ సీజన్-7 మాత్రం దుమ్ము లేపే విధంగా ఆకట్టుకుంది. ఈ సారి ఎవరూ ఊహించని విధంగా ఒక కామన్ మ్యాన్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఆయనే పల్లవి ప్రశాంత్. అయితే పల్లవి ప్రశాంత్ తర్వాత అరెస్ట్ అయి జైలకు వెళ్లడం కూడా మనం చూశాం.

అయితే ఈ సీజన్ లో ఎవరికి వారే ఆకట్టుకున్నారు. అందరూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. ఇలాంటి వారిలో ప్రియాంక జైన్ కూడా ఒకరు. ఆమె ఈ సీజన్ లో ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్ గా ఫైనల్ కు వెళ్లింది. కానీ ఆమె టాప్-3లో కూడా నిలబడలేకపోయింది. ఈ సారి విన్నర్ ప్రశాంత్ కాగా.. రన్నరప్ గా అమర్ దీప్, మూడో స్థానంలో శివాజీ నిలిచారు. అయితే తాజాగా ప్రియాంక జైన్ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. సంచలన కామెంట్లు చేసింది.

నేను హౌస్ లో హెల్త్ బాగా లేనప్పుడు ఇంజెక్షన్ పిల్స్ వాడాను. నా పనులు చేసుకోలని సమయంలో కూడా నేను హౌస్ లో ఉన్న వారికి వంట చేసి పెట్టాను. ఒక సారి నేను హెల్త్ బాగా లేదని రోటీలు దాచుకున్నాను. చివరకు దాన్ని కూడా హైలెట్ చేసి చూపించారు. అది నాకు చాలా బాధగా అనిపించింది. నేను రోటీలు దాచుకుంటే స్పై బ్యాచ్ వాళ్లే చాలా సార్లు తిన్నారు. వారు రోటీలు రాత్రి తిని కూడా ఉదయానికి దాచుకునే వారు. దాన్ని ఎవరూ చూపించలేదు. దానిపై నేను మాట్లాడితే దాన్ని కూడా ఎడిట్ చేశారు. వాస్తవానికి నేను బిగ్ బాస్ విన్నర్ అయ్యేదాన్ని.

హౌస్ లో ఉన్న వారందరూ వంద శాతం పర్ఫార్మెన్స్ ఇస్తే.. నేను మాత్రం వెయ్యి శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చాను. వాస్తవానికి టైటిల్ విన్నర్ నేనే కావాలి. గ్రూప్ గా ఆడటం వలన టైటిల్ దూరమైంది అంటే నేను నమ్మను. గౌతమ్ కోసం నేను కొన్ని సార్లు మాట్లాడింది మాత్రం హైలెట్ చేసి చూపించారు. నా ఫ్రెండ్ కంటే నా బ్రదర్ అయిన గౌతమ్ కు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. అందుకే అతనికి సపోర్ట్ చేశాను. నేను హౌస్ లో గేమ్స్ ప్లే చేయలేదు. శివాజీ వాళ్లు చాలా స్ట్రాటజీలతో గేమ్ ఆడారు. వాటిపై నేను ప్రశ్నిస్తే శివాజీ దగ్గర దానికి సమాధానం లేదు.

వాస్తవానికి నేను శివాజీతో క్లోజ్ గా ఉండేందుకు ట్రై చేశాను. కానీ నేను తప్పు చేశాను అని అతను అనేసరికి నాకు కోపం వచ్చింది. అందుకే అతనిపై కోప్పడ్డాను. శివాజీ నన్ను కావాలనే చాలా సార్లు దూరం పెట్టారు. శివాజీ హౌస్ లో జెన్యూన్ గా ఆడలేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు.

శివాజీ ఏంటో మాకు కనిపిస్తోంది. జనాలకు మాత్రం ఎందుకు కనిపించట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా శివాజీని అందరూ గుడ్డిగా నమ్మి మోసపోయారని అనిపిస్తోంది. ఆయన ఎప్పుడూ మాస్క్ తోనే ఉన్నాడు. వంద రోజులు కాదు వెయ్యి రోజులు అయినా అలానే నటించగలడు అంటూ ఫైర్ అయింది ప్రియాంక.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us