Priyamani: మేమిద్దరం అన్యోన్యంగా ఉన్నాం.. అయేషా వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ప్రియ‌మ‌ణి

Priyamani: సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ప్రియమ‌ణి..ముస్త‌ఫారాజ్ అన వ్య‌క్తిని 2017లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ముస్తాఫాకి ఇది రెండో పెళ్లి కాగా, మొద‌టి భార్య అయేషా త‌న భ‌ర్త‌తో విడాకులు కాలేద‌ని చెప్పుకొస్తుంది. తాజాగా అయేషా.. ప్రియమణి, ముస్తాఫా వివాహం చెల్లదని సంచలన ఆరోపణలు చేశారు. ముస్తఫా, ప్రియమణిపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు, అవి కోర్టులో నడుస్తున్నట్లు వెల్లడించారు.

తాను ఇప్ప‌టికీ ముస్తాఫా భార్య‌నే అని నా భ‌ర్త‌, నేను అధికారికంగా విడిపోలేదు. కనీసం విడాకులకు కూడా అప్లై చేయలేదు. ఇంతలోనే ప్రియమణిని ఆయన వివాహం చేసుకున్నారు. కోర్ట్ లో రెండో వివాహం చేసుకోలేదని ముస్తఫా చెబుతున్నారని అయేషా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ముస్తాఫా తరపున వాదిస్తున్న లాయర్ పూర్ణిమ భాటియాను సంప్రదించగా, ప్రియమణి, ముస్తఫా లపై అయేషా న్యాయపోరాటం నిజమే అని నిర్ధారణ చేశారు.

తాజాగా అయేషా వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె మా బంధానికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏమి లేద‌ని చెప్పుకొచ్చింది. అలానే ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని, అయినప్పటికీ రోజూ ఇద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటామని చెప్పింది. ఎక్క‌డ ఉన్నా మేము మంచి రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తున్నాం.

అమెరికాలో ఉన్నా కూడా ప్ర‌తి రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాం. బిజీ వ‌ల‌న మాట్లాడుకునే ఛాన్స్ లేక‌పోతే హాయ్, బాయ్ చెప్పుకుంటాం. ఆయన ఫ్రీగా ఉంటే నాతో చాట్‌ చేస్తాడు. నేను కూడా షూటింగ్స్‌ లేకుండా ఖాళీగా ఉంటే అతనికి ఫోన్‌ చేస్తా. కొంతమంది మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ప‌ర‌స్ప‌రం విష‌యాలు షేర్ చేసుకుంటాం. ఏద బంధానికైన ఇది అవ‌సరం అని ప్రియ‌మ‌ణి చెప్పుకొచ్చింది.

ముస్తాఫారాజ్, అయేషాల పెళ్లి 2010లో జ‌ర‌గ‌గా, వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయేషా వేధింపుల కేసు పెట్ట‌డంతో ఇద్ద‌రు విడిపోయారు. పిల్ల‌ల కోసం ప్ర‌తి నెల కొంత మొత్తాన్ని ముస్తాఫా పంపిస్తున్నాడు. 2017లో ప్రియ‌మ‌ణి- ముస్తఫాల వివాహం జ‌ర‌గ‌గా, ఇద్ద‌రు అన్యోన్యంగా ఉంటున్నారు.