కరోనాతో భార్య మృతి ఆమెకు వేసిన హాస్పిటల్ బిల్ చూసి భర్త మృతి

Advertisement

కరోనా సోకినా రోగుల పై ఇష్టారాజ్యంగా డబ్బులు దోచుకుంటున్నాయి ప్రవేట్ ఆసుపత్రులు. ఒక వైపు కరోనా సోకి బాధలో ఉంటె ఈ ప్రవేట్ దవాఖానల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. తాజాగా హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా ట్రీట్మెంట్ కు ప్రజల నుండి దారుణంగా డబ్బులు వసూల్ చేస్తున్నాయి. సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి కరోనా వ్యాధి లక్షణాలతో పది రోజుల క్రితం సోమజిగూడా డెక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం చేరారు. అయితే ఈ ఆసుపత్రిలో ఒక్క రోజుకి లక్ష రూపాయల పైగా బిల్లు వసూళ్లు చేస్తున్నారు. అలాగే పది రోజులకు 17.5 లక్షల బిల్లు వేశారు .

అందులో ఎనమిది లక్షలు సత్యనారాయణ రెడ్డి కుటుంబసభ్యులు ఆ ఆసుపత్రికి కట్టారు. అయితే నిన్నటి రోజున సత్యనారాయణ రెడ్డి భార్య కరోనా వ్యాధితో మృతి చెందింది. ఈ విషయం తెలియడంతో సత్యనారాయణరెడ్డి కూడా మృతి చెందాడు. అయితే మరో 8లక్షలు కడితేనే సత్యనారాయణ మృతదేహం ఇస్తామని ఆసుపత్రి మేనేజ్ మెంట్ సత్యనారాయణరెడ్డి కుటుంబసభ్యులను బెదిరింపులకు గురిచేసారు. ఒకవైపు ప్రవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన కూడా నియమాలను భేఖాతరు చేస్తున్నాయి అని అంటున్నారు బాధిత కుటుంబాలు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here