Prithviraj Sukumaran Injured : సలార్ మూవీ మెయిన్ విలన్ కు తీవ్ర గాయాలు.. విడుదల వాయిదా పడే ఛాన్స్..?
NQ Staff - June 26, 2023 / 09:23 AM IST

Prithviraj Sukumaran Injured : ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ మూవీ మీద ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. మూడు ప్లాపుల తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ఇది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే తాజాగా పృథ్విరాజ్ తీవ్రంగా గాయాల పాలయ్యారు.
ఆయన హీరోగా నటిస్తున్న మూవీ విలాయత్ బుద్ధ. మలయాళంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. కాగా కేరళ ఆర్టీసీ బస్సులో యాక్షన్ సీన్ తెరకెక్కిస్తుండగా ఆయన కాలికి భారీ ప్రమాదం జరిగింది. దాంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు డాక్టర్లు. ఆయన్ను పరిశీలించిన డాక్టర్లు కాలికి సర్జరీ చేయాలని సూచించారు.
దాదాపు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దాంతో విలాయత్ బుద్ద సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ విషయం తెలుసుకుని ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సలార్ సినిమాలో పృథ్విరాజ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాకపోతే మూడు నెలలు ఆలస్యం కాక తప్పదు.
సెప్టెంబర్ 28న మూవీని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోతే మాత్రం సలార్ విడదుల వాయిదా పడేఅవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆయన పాత్ర షూటింగ్ కంప్లీట్ అయిత నో ప్రాబ్లమ్. చూడాలి మరి ఏం జరుగుతుందో.