గాంధీ ఆసుపత్రి నుండి నలుగురు ఖైదీలు పరార్

Advertisement

కరోనా తెలంగాణాలో దారుణంగా విస్తరిస్తుంది. ఇప్పటికే చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె గాంధీ ఆసుపత్రి నుండి నలుగురు ఖైదీలు పరారయ్యారు. అయితే పలువురు ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీనితో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ నలుగురు ఖైదీలు కూడా చర్లపల్లి జైలు నుండి వచ్చారు అని సమాచారం. ఈరోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆసుపత్రి ప్రధాన భవనంలోని రెండవ అంతస్తులోని బాత్రూమ్స్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు అక్కడ నుండి తప్పించుకున్నారు. ఇక పరారైన ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here