Narendra Modi : 9 ఏళ్లుగా రంగు రంగుల త‌ల‌పాగాతో ద‌ర్శ‌న‌మిచ్చిన ప్ర‌ధాని మోదీ..!

NQ Staff - August 15, 2022 / 01:02 PM IST

Narendra Modi : 9 ఏళ్లుగా రంగు రంగుల త‌ల‌పాగాతో ద‌ర్శ‌న‌మిచ్చిన ప్ర‌ధాని మోదీ..!

Narendra Modi : ప్ర‌త్యేక దినాల‌లో భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌ట్టు, బొట్టు కాస్త వెరైటీగా ఉంటుంద‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఇక జాతీయ వేడుక‌ల‌లో ఆయ‌న త‌ల‌పాగాతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణా నిలుస్తారు. గ‌త ఎనిమిదేళ్లలో ప్రతి సంవత్సరం ప్రధాని మోడీ తలపాగా రంగు మారుతూ కనిపించింది. ఇక ఈ ఏడాది కూడా వెరైటీ త‌ల‌పాగాతో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. బ్లూ క‌ల‌ర్ కోట్, జాతీయ జెండా టైపులో ఉన్నత‌ల‌పాగాతో క‌నిపించారు.

Prime Minister Narendra Modi Talapaga

Prime Minister Narendra Modi Talapaga

వెరైటీ త‌ల‌పాగా..

2014 నుంచి 2021 వరకు ప్రధాని దుస్తులు, తలపాగా రెండూ చర్చలో ఉన్నాయి .2014లో ప్రధాని మోదీ తొలిసారిగా ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. ప్రకాశవంతమైన రంగుల కుర్తా, చుడీదార్ పైజామా ధరించాడు.2015లో ప్రధాని మోడీ క్రీమ్ కలర్ కుర్తా, దానిపై జాకెట్ వేసుకున్నాడు. ప్రధాని మోడీ తలపాగా నారింజ రంగులో ఉంది. కొన్ని చోట్ల తలపాగాపై ఆకుపచ్చ, ఎరుపు గీతలు కూడా ఉన్నాయి. 2016లో ప్రధాని మోదీ సాదా కుర్తా ధరించి ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన తలపాగా ఎరుపు, గులాబీ రంగులో ఆకట్టుకుంది.

2017లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట ప్రాకారంపై నుంచి నాలుగోసారి జెండాను ఎగురవేశారు. ఆయన తలపాగా మెరూన్,ప‌సుపు రంగుల‌తో కూడి ఉంది.. 2018లో పూర్తి కాషాయం రంగు త‌ల‌పాగా ధ‌రించారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ ఆరోసారి జెండాను ఎగురవేశారు. ఈసారి ఆయన తెలుపు రంగు కుర్తా ధరించారు. తలపాగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మిశ్రమంలో కనిపించింది.

2020లో కాషాయం రంగుతో పాటు తెలుపు రంగుతో కూడిన త‌ల‌పాగా ధ‌రించారు. 2021లో కూడా ప‌లు మార్పులు క‌నిపించాయి. ఇలా ప్ర‌తి ఏడాది వెరైటీ త‌ల‌పాగాల‌తో మెరుస్తూ న‌రేంద్ర మోదీ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. సోమవారం ఎర్రకోటపై వరుసగా తొమ్మిదోసారి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోదీ.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us